iDreamPost
android-app
ios-app

నవంబర్ లో భారీగా బ్యాంక్ హాలీడేస్.. మొత్తం ఎన్ని రోజులంటే?

  • Published Nov 02, 2023 | 3:09 PM Updated Updated Nov 02, 2023 | 3:09 PM

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. నవంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉండనున్నాయి. ఈ నెలలో పలు పండగలు రానుండడంతో దాదాపు 15 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి.

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. నవంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉండనున్నాయి. ఈ నెలలో పలు పండగలు రానుండడంతో దాదాపు 15 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి.

  • Published Nov 02, 2023 | 3:09 PMUpdated Nov 02, 2023 | 3:09 PM
నవంబర్ లో భారీగా బ్యాంక్ హాలీడేస్.. మొత్తం ఎన్ని రోజులంటే?

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. నవంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉండనున్నాయి. ఈ నెలలో పలు పండగలు రానుండడంతో దాదాపు 15 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ నెలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేసింది. బ్యాంకు పనులు ఉన్న వారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మీ పనులను చేసుకోవాల్సి ఉంటుంది. సెలవులు ఎప్పుడు ఉంటాయో తెలుసుకోకుండా బ్యాంకుకు వెళితే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ నెలలో బ్యాంకులకు సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి చేయాలనుకుంటే సెలవులు ఏ రోజుల్లో ఉన్నాయో తెలుసుకోవాల్సిందే.

నవంబర్‌ నెలలో సుమారు 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఈ హాలీడేస్ దేశంలోని ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని గమనించాలి. కాగా దీపావళి, గోవర్ధన్ పూజ, ఛత్ పూజ మొదలైన పండుగ సెలవులు ఉన్నాయి. దీంతో పాటు శని, ఆదివారాలు సెలవులను కూడా ఇందులో చేర్చారు. ఆర్‌బీఐ విడుదల చేసిన సెలవుల జాబితాలో.. నవంబర్ 5 ఆదివారం సెలవు. నవంబర్ 11 రెండవ శనివారం సెలవు. నవంబర్ 12 ఆదివారం సెలవు. నవంబర్ 19 ఆదివారం సెలవు. నవంబర్ 25 నాలుగవ శనివారం సెలవు. నవంబర్ 26 ఆదివారం సెలవు. నవంబర్ 1న బెంగళూరు, ఇంఫాల్, సిమ్లాలో కర్వా చౌత్, కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా హాలీడే. నవంబర్ 10న గోవర్ధన్ పూజ, లక్ష్మీపూజ, దీపావళి సందర్భంగా షిల్లాంగ్‌లో హాలీడే.

13, 14 తేదీల్లో నరక చతుర్థి, దీపావళి సందర్భంగా దాదాపు అన్ని నగరాల్లోని బ్యాంకులు మూసే ఉంటాయి. నవంబర్ 15న భాయ్ దూజ్, లక్ష్మీ పూజ కారణంగా గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, సిమ్లాలో బ్యాంకులకు హాలీడే. నవంబర్ 20న ఛత్ పూజ కారణంగా పాట్నా, రాంచీలో బ్యాంకులకు హాలీడే. నవంబర్ 23న డెహ్రాడూన్, షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నవంబర్ 27న గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి కారణంగా బ్యాంకులకు సెలవులు. నవంబర్ 30న కనకదాస్ జయంతి పురస్కరించుకుని బెంగళూరులో బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఈ సెలవులను గమనించి కస్టమర్లు తమ పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş