TATA PUNCH EV వచ్చేసింది.. 421KM రేంజ్- అదిరిపోయే ఫీచర్స్!

TATA Punch EV Price: టాటా కంపెనీ నుంచి పంచ్ ఈవీ రిలీజ్ అయ్యింది. ధర, స్పెసిఫికేషన్స్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

TATA Punch EV Price: టాటా కంపెనీ నుంచి పంచ్ ఈవీ రిలీజ్ అయ్యింది. ధర, స్పెసిఫికేషన్స్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

కార్లలో కూడా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా కొనసాగుతోంది. అయితే ఎలాంటి ఎలక్ట్రిక్ కారు కొనాలి అనే ప్రశ్న అయితే ఉంటుంది. పైగా విద్యుత్ కారు అనగానే కచ్చితంగా ధరలు అధికంగానే ఉంటాయి. అలాంటి వారికి టాటా మోటర్స్ ఇండియా ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. టాటా కంపెనీలో బాగా పాపులర్ అయిన పంచ్ మోడల్ కు ఈవీ వర్షన్ ని రిలీజ్ చేసింది. ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో దీని ధర బడ్జెట్ లో ఉంటడమే కాకుండా.. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ఈ టాటా పంచ్ ఈవీ అత్యధికంగా 421 కిలోమీటర్ల రేంజ్ తో వస్తోంది. అలాగే సేఫ్టీ పరంగా కూడా మంచి ఫీచర్స్ ని అందిస్తోంది. మరి.. ఈ కారు ధర ఎంత? స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం.

టాటా కంపెనీకి గ్లోబల్ లెవల్లో ఉన్న డిమాండ్, క్రెడిబిలిటీ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ టాటా పంచ్ విషయానికి వస్తే.. మోస్ట్ ట్రస్టెడ్, సెల్లింగ్ కారుగా వాహనదారుల మన్ననలు పొందింది. అలాంటి మోడల్ ని ఈవీగా తీసుకొస్తున్నారనే వార్త రాగానే అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ కారులో అలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయి.. ఇలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయని చాలానే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కంపెనీ అధికారికంగా లాంఛ్ చేయడంతో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలియడమే కాకుండా.. ధరపై కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఈ పంచ్ ఈవీ టాటా కంపెనీ డెవలప్ చేసిన ప్యూర్ ఈవీ ఆర్కిటెక్చర్ తో రూపొందించారు. ఇందులో పంచ్ ఈవీ స్మార్ట్, పంచ్ ఈవీ స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, టాటా పంచ్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ అంటూ మొత్తం 5 వేరియంట్స్ లో వస్తోంది.

టాటా పంచ్ ఈవీలో స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లు ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ 25kwh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్ తో 315 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. లాంగ్ రేంజ్ మోడల్ 35kwh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. లాంగ్ రేంజ్ కారు సింగిల్ ఛార్జ్ తో 421 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే ఛార్జింగ్ గురించి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎంతసేపు ఛార్జ్ చేయాలి? ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుందని అడుగుతారు. ఈ టాటా పంచ్ ఈవీలో స్టాండర్డ్ వేరియంట్ లో 3.3 కిలోవాట్స్ ఏసీ హోమ్ వాల్ బాక్స్ తో ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 9.4 గంటల సమయం పడుతుంది. 7.2 కిలో వాట్స్ బాక్స్ అయితే కేవలం 3.6 గంటల్లోనే బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయచ్చు. అదే మీరు 50 కిలో వాట్స్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ అయితే 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి కేవలం 56 నిమిషాల సమయమే పడుతుంది.

లాంగ్ రేంజ్ వేరియంట్ ని 15ఏ పాయింట్ తో ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అయ్యేందుకు 13.5 గంటల సమయం పడుతుంది. అదే మీరు 50కిలో వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ తో అయితే 10 నుంచి 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి కేవలం 56 నిమిషాల సమయమే పడుతుంది. ఈ కారులో ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ టాటా పంచ్ ఈవీ క్యాబిన్ ని ఇందులో మీకు 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లభిస్తుంది. 10 ఇంచెస్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఏక్యూఐ డిస్ ప్లేతో ఎయిర్ ప్యూరిఫయర్ కూడా లభిస్తుంది. అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉంటాయి. వాయిస్ కమాండ్ తో కూడిన సన్ రూఫ్ లభిస్తుంది. అలాగే మీరు దాదాపు 6 వేర్వేరు భాషల్లో 200 రకాల వాయిస్ కమాండ్స్ ని ఇవ్వచ్చు. వైర్ లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది.

ఇంక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, SOS కాలింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ధర విషయానికి వస్తే.. రూ.10.99 లక్షల ఎక్స్ షోరూమ్ తో ప్రారంభం అవుతుంది. హైఎండ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.14.49 లక్షలుగా ఉంది. అయితే ఈ ధరలు లిమిటెడ్ పిరియడ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ టాటా పంచ్ ఈవీకి బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. జనవరి 22 నుంచి డెలివిరీలు ప్రారంభంకానున్నాయి. మరి.. టాటా పంచ్ ఈవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments