iDreamPost
android-app
ios-app

TATA కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఈ రేంజ్ డిస్కౌంట్స్ మళ్లీ రావు!

  • Published May 10, 2024 | 3:29 PM Updated Updated May 10, 2024 | 3:29 PM

TATA Motors Offers Huge Discounts: ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఎన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్స్, అదనపు ప్రయోజనాలను ప్రకటించింది.

TATA Motors Offers Huge Discounts: ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఎన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్స్, అదనపు ప్రయోజనాలను ప్రకటించింది.

  • Published May 10, 2024 | 3:29 PMUpdated May 10, 2024 | 3:29 PM
TATA కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఈ రేంజ్ డిస్కౌంట్స్ మళ్లీ రావు!

టాటా మోటార్స్ కార్లకు సంబంధించి మార్కెట్ లో మంచి డిమాండ్, మంచి గుడ్ విల్ ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడైన కారు కొనాలి అనే ఆలోచన వస్తే.. దేశీయ తయారీ సంస్థ అయి టాటా కార్లు కచ్చితంగా మైండ్ లోకి వస్తాయి. చాలా మంది టాటాని కాదని.. మారుతీ వైపు మళ్లేందుకు ఒకే ఒక కారణం ఏదైనా ఉందంటే.. అది ధర విషయంలోనే. టాటా కార్లు కాస్త ధర ఎక్కువని మారుతీ వైపు చూస్తారు. కానీ, బిల్ట్ క్వాలిటీ, సేఫ్టీలో టాటా కార్లు పెట్టింది పేరు. అయితే ఇప్పుడు టాటా కార్లు కొనాలి అనుకునే వారికి ఇది పెద్ద శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే టాటా కంపెనీ తమ ఈవీ కార్లలో సెలక్టివ్ మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది.

టాటా కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎలక్ట్రిక్ కార్లను కూడా మార్కెట్ లోకి విడుదల చేస్తోంది. ఇప్పటికే టాటా నుంచి టాటా టియాగో, టాటా నెక్సన్, టాటా పంచ్ మోడల్స్ మార్కెట్ లో ఉన్నాయి. వీటికి వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఇప్పుడు టాటా కంపెనీ ఈవీ మోడల్స్ పై అద్భుతమైన ఆఫర్స్, బెనిఫిట్స్ ని అందిస్తోంది. కార్పోరేట్ బోనస్, గ్రీన్ బోనస్, ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్ అంటూ భారీ భారీ డిస్కౌంట్స్ ని అందిస్తోంది. అయితే అన్ని మోడల్స్ మీద కాదు. కేవలం టాటా నెక్సన్ ఈవీ, టాటా టియాగో ఈవీ మోడల్స్ పైనే ఈ ఆఫర్స్ లభిస్తున్నాయి. టాటా పంచ్ ఈవీ మీద మాత్రం ఈ ఆఫర్స్ లేవు.

Nexon EV

నెక్సన్ ఈవీ:

టాటా కంపెనీ నుంచి బాగా క్లిక్ అయిన మోడల్స్ లో నెక్సన్ ఒకటి. ఇది నార్మల్ వర్షన్ మాత్రమే కాకుండా.. ఈవీ మోడల్ కూడా బాగా క్లిక్ అయ్యింది. అలాంటి హై డిమాండ్ ఉన్న మోడల్ పై డిస్కౌంట్స్ రావడం మళ్లీ సాధ్యం కాదేమో. ఈ టాటా నెక్సన్ ఈవీపై ఏకంగా రూ.75 వరకు బెనిఫిట్స్(2023 మోడల్ మీద మాత్రమే) లభిస్తున్నాయి. వాటిలో రూ.50 వేలు వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.5 వేలు కార్పొరేట్ బోనస్ గా అందిస్తున్నారు. అలాగే రూ.20 వేల వరకు ఎక్స్ ఛేంజ్ బోనస్ లభిస్తోంది. అదే 2024 మోడల్ ఈవీపై అయితే రూ.55 వేల వరకు ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంది. ఈ నెక్సన్ ఈవీ ధర రూ.14.4 లక్షల నుంచి రూ.19.4 లక్షల వరకు ఉంది.

Tiago

టియాగో:

టాటా టియాగో మిడిల్ క్లాస్ పీపుల్ ఎంతో ఇష్టపడే మోడల్. బడ్జెట్ లో వచ్చే మంచి ఈవీల్లో టియాగో పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ టాటా టియాగో 2023 మోడల్ కొనుగోలు చేయాలి అనుకుంటే మీకు గరిష్టంగా రూ.72 వేల వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. టాటా టియాగోపై రూ.50 వేలు గ్రీన్ బోనస్ కింద డిస్కౌంట్ చేస్తున్నారు. అలాగే రూ.15 వేలు ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. అంతేకాకుండా రూ.7 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది. అదే మీరు 2024 మోడల్ టాటా టియాగో ఈవీని కొనుగోలు చేస్తే.. మీకు రూ.52 వేల వరకు డిస్కౌంట్స్ లభిస్తాయి. ఈ టియాగో ఈవీ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.11.39 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ ఆఫర్స్ కేవలం మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. షో రూమ్, సిటీ మారినప్పుడు ఆఫర్స్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. దగ్గర్లోనీ టాటా డీలర్ ని సంప్రదిస్తే మీకు సరైన ఆఫర్స్ వివరాలు తెలుస్తాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet