iDreamPost
android-app
ios-app

Tata: ఈ టాటా ఎలక్ట్రిక్‌ కార్ల ఫీచర్లు అదుర్స్! భారీ తగ్గింపుతో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా..

  • Published Sep 12, 2024 | 5:02 PM Updated Updated Sep 12, 2024 | 5:02 PM

Tata: టాటా కంపెనీ వినియోగదారులను ఎన్నో విధాలుగా ఆకట్టుకుంటుంది. తన ఎలక్ట్రిక్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను ఇస్తుంది.

Tata: టాటా కంపెనీ వినియోగదారులను ఎన్నో విధాలుగా ఆకట్టుకుంటుంది. తన ఎలక్ట్రిక్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను ఇస్తుంది.

Tata: ఈ టాటా ఎలక్ట్రిక్‌ కార్ల ఫీచర్లు అదుర్స్! భారీ తగ్గింపుతో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా..

తన కార్ల అమ్మకాలను పెంచుకోవడానికి టాటా కంపెనీ వినియోగదారులను ఎన్నో విధాలుగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు పండుగ సీజన్ నడుస్తుంది. అందువల్ల మంచి సేల్స్‌ని రాబట్టేందుకు టాటా మోటార్స్ పెట్రోల్‌, డీజీల్‌తో నడిచే కార్లపై భారీ తగ్గింపులని ఇస్తుంది. తాజాగా తన ఎలక్ట్రిక్ కార్లపై కూడా అదిరిపోయే డిస్కౌంట్లను ఇస్తుంది. ‘ఫెస్టివల్ ఆఫ్ కార్స్’ లో భాగంగా టాటా మోటార్స్ తాజాగా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై రూ .3 లక్షల దాకా భారీ తగ్గింపుని ఇచ్చింది. అలాగే పంచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై రూ .1.20 లక్షల దాకా తగ్గింపుని ఇచ్చింది. టాటా పంచ్ రూ. 9.99 లక్షలు ఉంటుంది. నెక్సాన్ రూ.12.49 లక్షలు ఉంటుంది. ఈ కార్లు కొంటే ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఉంది. వీటిని కొన్న కస్టమర్లు అదనంగా ఏకంగా 6 నెలల పాటు 5,500 పైగా టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్ లలో ఫ్రీగా ఛార్జింగ్ పొందవచ్చు. ఈ ఆఫర్లు అక్టోబర్ 31 దాకే ఉంటాయి. అసలు ఈ కార్లని ఎందుకు కొనవచ్చు? వీటిలో ఉన్న సూపర్ ఫీచర్లు ఏమిటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇక టాటా పంచ్‌ ఈవీ విషయానికి వస్తే.. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులోని 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని ఫుల్‌ ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది..ఇది 80bhp పవర్, 114nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇక 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఫుల్ ఛార్జ్‌పై 421 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. ఇది 120bhp పవర్, 190 nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్‌ సీట్లు, 6-స్పీకర్ల సౌండ్ సిస్టమ్‌, సన్‌రూఫ్ లాంటి సూపర్ ఫీచర్లతో ఈ కార్ వస్తుంది. పైగా ఇది సేఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌ని కలిగి ఉంది.

ఇక టాటా నెక్సాన్ ఈవీ విషయానికి వస్తే .. ఇది 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో వస్తుంది. ఈ కారులోని 30 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ గల మోటార్ 129 ps మాక్సిమం పవర్ ని ఇస్తుంది. 215 nm మాక్సిమం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీన్ని ఫుల్ గా ఛార్జ్ చేస్తే ఏకంగా 325 కిలోమీటర్ల రేంజ్‌ దాకా ఇస్తుంది. ఇక 40.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మోటార్ 144 ps పవర్ ని, 215 టార్క్‌ని జనరేట్ చేస్తుంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేస్తే గంటకు 465 కిలోమీటర్ల దాకా రేంజిని ఇస్తుంది. దీనికి డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్‌ ఉంటుంది. అందువల్ల కేవలం 56 నిమిషాల్లో 80% దాకా ఛార్జ్ చేయవచ్చు. ఇలాంటి సూపర్ ఫీచర్ కోసం దీనిని కొనుగోలు చేయచ్చు. ఈ కార్ 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి అప్డేటెడ్ ఫీచర్లతో వస్తుంది. ఇది కూడా సేఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌ని కలిగి ఉంది. ఇక టాటా భారీ తగ్గింపులు అందిస్తున్న ఈ కార్ల పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.