iDreamPost
android-app
ios-app

Amazon Great Indian Festival 2024 సేల్ వచ్చేస్తోంది.. భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు!

  • Published Sep 16, 2024 | 5:14 PM Updated Updated Sep 16, 2024 | 5:14 PM

Amazon Great Indian Festival 2024: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను సొంతం చేసుకోబోతున్నారు. ఇక ఆ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

Amazon Great Indian Festival 2024: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను సొంతం చేసుకోబోతున్నారు. ఇక ఆ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

Amazon Great Indian Festival 2024 సేల్ వచ్చేస్తోంది.. భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు!

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారికి ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ అదిరిపోయే శుభావార్తని తీసుకు వచ్చింది. తన వినియోగదారుల కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఈ నెల అంటే సెప్టెంబర్ 27 నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు తాజాగా అధికారికంగా తెలిపింది. ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌ అయితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. వారికి కాస్త ముందుగానే ఈ సేల్ స్టార్ట్ అవబోతోంది. ప్రైమ్ మెంబెర్స్ కి సెప్టెంబర్ 26వ తేదీ నుంచే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో కస్టమర్లు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను సొంతం చేసుకోబోతున్నారు. ఇక ఆ ఆఫర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్స్, ఫ్యాషన్ సహా ఇతర ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లని ఇస్తుంది అమెజాన్. అలాగే ఎస్బీఐ డెబిట్ కార్డు, ఎస్బీఐ కార్డుపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఇక అమెజాన్ యూపిఐ ద్వారా మినిమం 1000 రూపాయలతో ఏవైనా కొనుగోలు చేస్తే ఫ్లాట్ 100 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా ఈ సేల్ నుంచి పొందవచ్చు. రియల్‌మి, పోకో, శాంసంగ్, వివో, వన్‌ప్లస్ ఇంకా ఇతర ఫోన్ బ్రాండ్‌లపై కళ్ళు చెదిరిపోయే భారీ డిస్కౌంట్లు ఉంటాయి. వీటితో యాపిల్ పాటు ఐఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్‌లు మనం పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ల యాక్ససరీలపై ఏకంగా 80 శాతం తగ్గింపు ఉంటుంది.

ఇక ల్యాప్‌టాప్‌లపై 40 శాతం, రిఫ్రిజిరేటర్‌లపై 55 శాతం, ఎయిర్ కండీషనర్‌లపై 55 శాతం, వాషింగ్ మెషిన్‌లపై 60 శాతం దాకా భారీ డిస్కౌంట్లని మనం ఈ సేల్ లో పొందవచ్చు. ఇంకా ఈ సేల్‌లో హెడ్‌ఫోన్స్‌ను, స్మార్ట్‌వాచ్‌లను చాలా తక్కువ ధరకే మనం కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు స్పీకర్లు, స్మార్ట్‌టీవీలను కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్‌టీవీలపై అయితే ఏకంగా 65 శాతం దాకా తగ్గింపు ఉంటుంది. హోం అప్లియన్సేస్ పై ఏకంగా 70 శాతం దాకా తగ్గింపు ఉంటుంది. ఎక్స్చేంజి ఆఫర్ల కింద మీరు రూ. 65,000 దాకా తగ్గింపుని పొందవచ్చు. ఇక భారీ ఆఫర్లతో వస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.