iDreamPost
android-app
ios-app

బంపర్ ఆఫర్.. Motorola g45 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్!

  • Published Aug 29, 2024 | 10:34 AM Updated Updated Aug 29, 2024 | 10:34 AM

Motorola g45 5G: మోటోరోలా తాజాగా జి45 5జి ఫోన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ పై ఇప్పుడు భారీ బ్యాంక్ ఆఫర్ నడుస్తుంది. కేవలం 11 వేల ధరలో ఉన్న ఈ 5జి స్మార్ట్ ఫోన్ బడ్జెట్ వినియోగదారులకు బెస్ట్ ఫోన్ అనే చెప్పాలి.

Motorola g45 5G: మోటోరోలా తాజాగా జి45 5జి ఫోన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ పై ఇప్పుడు భారీ బ్యాంక్ ఆఫర్ నడుస్తుంది. కేవలం 11 వేల ధరలో ఉన్న ఈ 5జి స్మార్ట్ ఫోన్ బడ్జెట్ వినియోగదారులకు బెస్ట్ ఫోన్ అనే చెప్పాలి.

బంపర్ ఆఫర్.. Motorola g45 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్!

మోటోరోలా కంపెనీ ఇండియన్ మార్కెట్లో తాజాగా మోటోరోలా జి45 5జి ఫోన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ సేల్ ప్రస్తుతం స్టార్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఇప్పుడు భారీ బ్యాంక్ ఆఫర్ నడుస్తుంది. కేవలం 11 వేల బడ్జెట్ ధరలో మార్కెట్ లో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ 5జి స్మార్ట్ ఫోన్ బడ్జెట్ వినియోగదారులకు బెస్ట్ ఫోన్ అనే చెప్పాలి. ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 4GB + 128GB వేరియంట్ ని రూ. 10,999 ధరతో అందిస్తుంది. 8GB + 128GB వేరియంట్ ని రూ. 12,999 ధరకు అందిస్తుంది మోటోరోలా కంపెనీ. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ మరియు motorola.in నుంచి మనం కొనుగోలు చేయవచ్చు. .

ఇదిలా ఉండగా మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ఇస్తుంది. ఈ ఫోన్ ను Axis మరియు IDFC First బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1000 రూపాయల డిస్కౌంట్ వస్తుంది. అంటే, ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను కేవలం రూ. 9,999 ధరకే మనం కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా జి45 5జి ఫీచర్స్ విషయానికి వస్తే.. మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం10 వేల ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తోనే తీసుకొచ్చింది. ఈ జి45 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 6 ఎస్ జెన్ 5జి చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ప్రోసెసర్ లో లైట్ ఫోటోలు, ఫాస్ట్ డౌన్ లోడింగ్ ఇంకా మంచి పవర్ మేనేజ్మెంట్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ కలిగి ఉంటుంది. బేస్ వేరియంట్ అయితే 4 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంది.

ఈ లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచెస్ HD+ IPS LCD స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ని కలిగి ఉంటుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. బ్యాక్ 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ FHD రిజల్యూషన్ తో వీడియోలను షూట్ చేస్తుంది. అది కూడా 30fps తో ఈ ఫోన్ షూట్ చేయగలదు. అలాగే ఈ ఫోన్ క్లారిటీ ఫోటోలని కూడా అందిస్తుంది.దీని సౌండ్ చాలా క్లారిటీగా ఉంటుంది. ఇది డాల్బీ అట్మాస్, హై- రెస్ సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ టర్బో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş