Sukanya Samriddhi Yojana balance details check this way: సుకన్య సమృద్ధి యోజనలో డబ్బు జమ చేసేవారు.. బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి!

సుకన్య సమృద్ధి యోజనలో డబ్బు జమ చేసేవారు.. బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి!

ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు భారం కాకూడదని కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరి ప్రతి నెల కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసినట్లైతే ఆ సొమ్ముపై కేంద్రం 8 శాతం వడ్డీని కలిపిస్తుంది. ఈ డబ్బు ఆ అమ్మాయి చదువులకు, పెళ్లికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కల్పించడంలో భాగంగానే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు చేరొచ్చు. అయితే వారి వయసు 10ఏళ్లలోపు ఉండాలి. ఏడాదిలో కనీసం రూ. 250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అమ్మాయికి 21ఏళ్లు వచ్చాక ఖాతా మెచ్యూరిటీ ఉంటుంది. అయితే ఈ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ ను ఈ విధంగా తెలుసుకోవచ్చు.

సుకన్య సమృద్ధి ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది విషయం మీకు ఏ బ్యాంక్ లో అయితే ఖాతా ఉంటుందో ఆ బ్యాంక్ కు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఖాతా పాస్ బుక్ ప్రింట్ తీసుకోవడం ద్వారా అందులో మీరు ఎప్పుడెప్పుడు ఎంత జమ చేశారు, ఎంత వడ్డీ జమ అయ్యింది అనే పూర్తి వివరాలు కనిపిస్తాయి. మరోవైపు.. మీరు ఆన్‌లైన్ ద్వారా కూడా అకౌంట్లో బ్యాలెన్స్ అనేది తెలుసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి కూడా ఖాతాలో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవచ్చు. అయితే డబ్బును ఖాతా నుంచి డ్రా చేయడానికి మాత్రం వీలుపడదు.

Show comments