iDreamPost
android-app
ios-app

కేంద్రం సూపర్ స్కీమ్.. హామీ లేకుండా లోన్స్.. వడ్డీ క్యాష్ బ్యాక్ కూడా!

  • Published Jul 28, 2024 | 6:45 PM Updated Updated Jul 28, 2024 | 6:45 PM

PM svanidhi yojana: మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే మీకు కేంద్రం నుంచి సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. హామీ లేకుండా లోన్ పొందొచ్చు. వడ్డీ క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు.

PM svanidhi yojana: మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే మీకు కేంద్రం నుంచి సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. హామీ లేకుండా లోన్ పొందొచ్చు. వడ్డీ క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు.

  • Published Jul 28, 2024 | 6:45 PMUpdated Jul 28, 2024 | 6:45 PM
కేంద్రం సూపర్ స్కీమ్.. హామీ లేకుండా లోన్స్.. వడ్డీ క్యాష్ బ్యాక్ కూడా!

వ్యాపారం చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా చేతిలో సరిపడా డబ్బు లేనప్పుడు లోన్ తీసుకోవాలని చూస్తుంటారు. ఇందుకోసం బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తుంటారు. ఆయా సంస్థలు అన్ని వివరాలను సరిచూసుకున్నాక లోన్స్ మంజూరు చేస్తుంటాయి. అయితే ఈ లోన్స్ కు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. వడ్డీ కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. మరి మీరు కూడా ఏదైనా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? లోన్ కోసం చూస్తున్నారా? కేంద్రం సూపర్ స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా హీమీ లేకుండా రుణాన్ని పొందొచ్చు. అదే విధంగా వడ్డీ క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు.

పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే పథకాలను ప్రవేశపెడుతోంది. పొదుపు పథకాలను కూడా అమలు చేస్తున్నది. చిరు వ్యాపారుల కోసం కేంద్రం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి స్వానిధి యోజన. ఈ పథకం ద్వారా వీది వ్యాపారులకు సాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వ బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు రుణం మంజూరు అవుతుంది. వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి స్వానిధి యోజన కింద రూ.50 వేల వరకు రుణాలు అందజేస్తారు.

 

స్వానిధి ద్వారా లోన్ పొందడం కోసం ఎలాంటి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పథకం కింద మూడు దశల్లో రుణం ఇవ్వడం జరుగుతుంది. మొదటి దశలో రూ.10,000 అందిస్తారు. దీన్ని 12 నెలల్లో తిరిగి చెల్లించాలి. మీరు ఈ రుణాన్ని తిరిగి చెల్లిస్తే, మీకు రెట్టింపు రుణం అంటే రూ. 20 వేలు మంజూరు చేస్తారు. దీని తర్వాత మూడోసారి రూ.50 వేల వరకు రుణం పొందొచ్చు. ఏడాదికి ఏడు శాతం చొప్పున వడ్డీరాయితీ ద్వారా రెగ్యులర్ రీపేమెంట్ ప్రోత్సహించబడుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా 1200 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpir girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş