iDreamPost
android-app
ios-app

సీనియర్ సిటిజన్లకు సూపర్ స్కీమ్.. రూ.1000 పెట్టుబడితో.. లక్షల్లో లాభం!

Senior Citizens Savings Scheme: కేంద్ర సంస్థలో ఒకటైన పోస్టాఫీస్ అనేక పథకాలను అందిస్తుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలానే వృద్ధుల కోసం ఓ పోస్టాఫీస్ ఓ అదిరిపోయే స్కీమ్ ను అమలు చేస్తుంది.

Senior Citizens Savings Scheme: కేంద్ర సంస్థలో ఒకటైన పోస్టాఫీస్ అనేక పథకాలను అందిస్తుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలానే వృద్ధుల కోసం ఓ పోస్టాఫీస్ ఓ అదిరిపోయే స్కీమ్ ను అమలు చేస్తుంది.

సీనియర్ సిటిజన్లకు సూపర్ స్కీమ్.. రూ.1000 పెట్టుబడితో.. లక్షల్లో లాభం!

నేటికాలంలో సేవింగ్స్ అనేది చాలా ముఖ్యమైనది. కారణంగా ఎప్పుడు ఎటుంటి ఆర్థిక సమస్యలు వస్తాయో చెప్పలేము. ఇలాంటి సమయంలో మనల్ని కాపాడేది..మనం సేవ్ చేసుకున్న డబ్బులు మాత్రమే. అలానే వయస్సులో ఉన్నప్పుడు సంపాదించన దాట్లో కొంత వివిధ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా వృద్ధాప్యంలో అవి ఉపయోగపడతాయి. ఇది ఇలా ఉంటే కేంద్ర సంస్థలో ఒకటైన పోస్టాఫీస్ కూడా అనేక పథకాలను అందిస్తుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలానే వృద్ధుల కోసం ఓ పోస్టాఫీస్ ఓ అదిరిపోయే స్కీమ్ ను అమలు చేస్తుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్దాప్యంలో ఆర్థిక భరోసా ఉంటుంది. మరి.. ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

పోస్టాఫీస్ అందిస్తున్న పలు స్కీమ్స్ లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం ఒకటి. దీనిపై చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో పెట్టుబడులు పెడితే.. మెచ్యూరిటీ సమయానికి మంచి లాభాలు వస్తాయి.  ఈ స్కీమ్ కు 5 ఏళ్ల పాటు కాల పరిమితి ఉంటుంది. ఈ స్కీమ్ లో పెట్టుబడిగా 1000  రూపాయలను ప్రారంభించ వచ్చు. గరిష్టంగా రూ.30 లక్షల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక ఈ పథకంలోని పెట్టుబడులకు 8.2 శాతం వడ్డీ అందుతోంది.  ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకంలో పెట్టే పెట్టుబడిన బట్టీ వచ్చే ఇంట్రస్ట్ ఆధారపడి ఉంటుంది. అలా రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే.. నిర్ణత ఐదేళ్ల వ్యవధి పూర్తయ్యే సరికి గరిష్టంగా రూ.12.30 లక్షల వడ్డీ పొందవచ్చు.

ప్రతి త్రైమాసికంలో రూ.  61,500 వడ్డీగా క్రెడిట్ చేయబడుతుంది. ఈ విధంగా, 5 సంవత్సరాల తర్వాత, మీరు మెచ్యూరిటీ మొత్తంగా  వడ్డీతో కలిపి 42.30 లక్షలు పొందుతారు. అలానే ఎవరైనా ఈ స్కీమ్‌లో 5 ఏళ్ల పాటు 15 లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తే… ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతం ప్రకారం, నిర్ణిత కాలంలో రూ.6,15,000 వడ్డీని పొందుతారు. మీరు ప్రతి మూడు నెలలకు వడ్డీని లెక్కిస్తే,  రూ.30,750 పొందుతారు. ఈ విధంగా, 15,00,000లకు వడ్డీ 6,15,000 రూపాయలతో కలిపి మెచ్యూరిటీ మొత్తంగా మొత్తం 21,15,000 రూపాయలు పొందుతారు.

ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టే వారికి కొన్ని అర్హతలు ఉండాలి.  60 ఏళ్లు లేదా అంతకు పైబడిన వయస్సు వారు ఈ స్కీమ్ లో చేరవచ్చు.  అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకుంటున్న, డిఫెన్స్ నుండి పదవీ విరమణ చేసిన వారికి కొన్ని షరతులతో వయోపరిమితిలో సడలింపు ఉన్నాయి. ఇక ఈ పథకంలో ఐదేళ్ల మెచ్చూర్ కాలపరిమితి పూరైన తరువాత మీకు ఇష్టం ఉంటే..మరో మూడేళ్లు పొడగించుకోవచ్చు. అయితే పొడిగించిన అకౌంట్ మెచ్యూరిటీ తేదీలో వర్తించే రేటుపై వడ్డీని లభిస్తుంది.  అలానే సీనియర్ సిటిజన్ల్ స్కీమ్ కు సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.