iDreamPost
android-app
ios-app

సూపర్‌హిట్‌ పథకం.. ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి రోజూ రూ.1366 పొందే అవకాశం

  • Published Sep 23, 2023 | 11:28 AM Updated Updated Sep 23, 2023 | 11:35 AM
  • Published Sep 23, 2023 | 11:28 AMUpdated Sep 23, 2023 | 11:35 AM
సూపర్‌హిట్‌ పథకం.. ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి రోజూ రూ.1366 పొందే అవకాశం

ముందు మనిషి ఎంతో కొంత డబ్బు సంపాదించాలి.. కొంతకాలం తర్వాత ఆ డబ్బే.. తిరిగి డబ్బును సంపాదించాలి.. మనిషి రిలాక్స్‌ అవ్వాలి అని అంటారు పెద్దలు. ధరలు మండిపోతున్న నేటి కాలంలో.. కనీస అవసరాలు తీర్చుకోవడానికే నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇక భారీ మొత్తంలో సేవింగ్స్‌ అంటే కష్టమే. కానీ భవిష్యత్తు బాగుండాలన్నా.. వృద్ధాప్యంలో భరోసా లభించాలన్నా.. పొదుపు చేయడం తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే బ్యాంక్‌లు, పోస్టాఫీసులు రిస్క్‌ లేని రాబడి స్కీమ్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటిల్లో ఒక్కసారి పెట్టుబడి పెడితే.. గరిష్టకాలం రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఇలా సూపర్‌హిట్‌ అయిన స్కీములలో​.. తాజాగా ఒక దాని గురించి మీకు పరిచయం చేయబోతున్నాము.

కేం‍ద్ర ప్రభుత్వం వృద్ధులను దృష్టిలో పెట్టుకుని.. సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ను అందిస్తోంది. ఇది పోస్టాఫీసులు, బ్యాంక్‌ల్లో అందుబాటులో ఉంది. అయితే గతంలో ఈ స్కీమ్‌లో గరిష్టంగా కేవలం 15 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది. అయితే తాజాగా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సందర్భంగా ఈ స్కీమ్‌ లిమిట్‌ను 30 లక్షల రూపాయల వరకు పెంచారు. పెరిగిన లిమిట్‌ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేటును కూడా పెంచింది. వీటిపై గతంలో 8 శాతంగా ఉన్న వడ్డీని.. తాజాగా 8.20 శాతానికి పెంచింది.

60 ఏళ్లు దాటిన వృద్ధులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ముందుగా ఐదేళ్ల పాటు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలి. మరో 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు. ఈ పథకంలో భార్యాభర్తలిద్దరూ పెట్టుబడి పెట్టడం ద్వారా గరిష్టంగా నెలకు 41 వేల వరకు పొందవచ్చు. ఉదాహరణకు మీకు 60 ఏళ్లు దాటాయి అనుకుంటే.. మీరు ఈ పథకంలో 30 లక్షల వరకు పొదుపు చేసే అవకాశం ఉంది. ఇక భార్యాభర్తలిద్దరూ కలిసి 60 లక్షలు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టారనుకుందాం. అప్పుడు మీకు ప్రతి ఏడాది రూ.4,92,000 వడ్డీ లభిస్తుంది. అంటే నెలకు 41 వేలు రూపాయలు.. రోజుకు రూ.1366 అన్నమాట.

ఈ పథకంలో భాగంగా మీరు ఒకేసారి 30 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తే.. ఐదేళ్ల కాలంలో 12.3 లక్షల రూపాయల వడ్డీ లభిస్తుంది. అంటే ఏడాదికి 2.46 లక్షల రూపాయలు వస్తాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ అకౌంట్‌లో జమ అవుతాయి. అంటే మూడు నెలలకు కలిపి 61,500 రూపాయలు అకౌంట్‌లో జమ అవుతాయి. ఇద్దరి పేరుపై చెరో 30 చొప్పున 60 లక్షలు జమ చేస్తే.. మూడు నెలలకు ఒకసారి 1,23,000 రూపాయల వడ్డీ జమ అవుతుంది. మరి ఈ స్కీంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetesrar satın algrandpashabet