SBI: రేషన్ కార్డు ఉన్నవారికి SBI గుడ్ న్యూస్.. వారికి ఉచితంగా..

రేషన్ కార్డు ఉన్నవారికి SBI గుడ్ న్యూస్.. వారికి ఉచితంగా..

SBI: మీరు తెల్ల రేషన్ కార్డ్ హోల్డర్స్ అయితే మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేషన్ కార్డ్ కలిగి 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్తను అందించింది. పూర్తి వివరాలు మీకోసం..

SBI: మీరు తెల్ల రేషన్ కార్డ్ హోల్డర్స్ అయితే మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేషన్ కార్డ్ కలిగి 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్తను అందించింది. పూర్తి వివరాలు మీకోసం..

ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెల్లరేషన్ కార్డు కలిగిన వారందరికీ తీపికబురును అందించింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ప్రభుత్వాలు సైతం విస్తృత ప్రయోజనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. లోన్స్ అందించడం, సబ్సిడీలు, ఉచిత పథకాలకు తెల్ల రేషన్ కార్డు ఉపయోగపడుతోంది. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్ అందించింది. వారికి ఉపాధి కల్పించడంలో భాగంగా వారందరికీ ఫ్రీగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించనున్నది.

నిరుద్యోగం వెంటాడుతోంది. ఏటా వేలమంది పట్టాభద్రులై బయటికి వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయాల్లో స్వయం ఉపాధిని కల్పించేందుకు ఎస్బీఐ ఓ కార్యక్రమాన్ని చేపడుతున్నది. యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 2010 నుంచే ఈ కార్యక్రమాలను చేపడుతోంది. ఎస్బీఐ అందించే ఫ్రీ ట్రైనింగ్ ప్రయోజనాలు పొందాలంటే 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతా యువతకు ఉపాధి కల్పించేందుకు ఎస్బీఐ ఈ శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నది. వారికి ఉపాధి అవకాశాలను అందించడం ద్వారా వలసలను నివారిస్తున్నది. నిరుద్యోగ యువతను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తోంది. వివిధ వృత్తుల్లో శిక్షణనిస్తుంది. ట్రైనీలకు ఉచిత హాస్టల్ వసతిని కల్పిస్తోంది. అభ్యర్థులకు తెలుగులో చదవడం, రాయడం తెలిసి ఉండాలి.కనీసం 7వ తరగతి పూర్తి చేయాలి.

ఉన్నత విద్య అవసరం లేదు. దరఖాస్తుదారులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారై ఉండాలి. ఏసీ మెకానిక్, మోటార్ రివైండింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, రిఫ్రిజిరేషన్, సీసీ కెమెరా ఇన్‌స్టాలేషన్, ఫోన్ రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ కోర్సులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికట్లను అందిస్తుంది. వారు వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈజీగా లోన్స్ కూడా అందిస్తోంది ఎస్బీఐ.

Show comments