nagidream
Big Shock To Credit Card Users: క్రెడిట్ కార్డులు వాడే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్ ని తీసుకురానుంది. కొన్ని నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి వస్తుండగా.. కొన్ని రూల్స్ మాత్రం జూలై 15 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే ఈ కొత్త నిబంధనలతో యూజర్స్ భారీగా నష్టపోనున్నారు.

బ్యాంకులు తమ ఖాతాదారులకు కొన్నిసార్లు గుడ్ న్యూస్ చెప్తుంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడం, హోమ్ లోన్ మీద వడ్డీ రేటు తగ్గించడం వంటి శుభవార్తలు చెప్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ గుడ్ న్యూస్ లతో పాటు బ్యాడ్ న్యూస్ లు కూడా చెప్తుంటాయి. హోమ్ లోన్ పై, ఇతర లోన్లపై వడ్డీ రేటు పెంచడం, ఏటీఎం విత్ డ్రాల విషయంలో మార్పులు తీసుకురావడం, ఛార్జీలు పెంచడం వంటివి చేసి ఖాతాదారులకు షాక్ ఇస్తుంటాయి. తాజాగా దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఇండియా తమ బ్యాంకు క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్ ఇచ్చింది. జూలై 1 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. వాస్తవానికి జూన్ 1 నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల జూలై 1కి వాయిదా వేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపిక చేసినటువంటి పలు క్రెడిట్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రివార్డు పాయింట్ల విషయంలో కొత్త రూల్స్ ని తీసుకొస్తుంది. వచ్చే నెల జూలై 1 నుంచి ఎవరైతే ఎస్బీఐ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ లావాదేవీలు చేస్తారో.. ఆ లావాదేవీలపై రివార్డు పాయింట్లు రావు. జూలై 1 నుంచి ప్రభుత్వ లావాదేవీలపై వచ్చే రివార్డ్ పాయింట్లను తొలగిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. దీంతో పాటు కొన్ని కార్డులకు జూలై 15 నుంచి కొత్త రూల్స్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం జూలై 15 నుంచి ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ప్రభుత్వ లావాదేవీలపై రివార్డు పాయింట్లు అనేవి రావు.