iDreamPost
android-app
ios-app

యూజర్లకు గుడ్ న్యూస్.. UPI ద్వారా రూపే క్రెడిట్ కార్డు పేమెంట్స్ కి RBI అనుమతి

ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ చేయాలంటే బ్యాంక్ ఖాతా యూపీఐతో లింక్ చేసుకుని చేసేవాళ్లు. అయితే క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్స్ చేసుకునే సౌలభ్యం కల్పించింది ఆర్బీఐ. ఆ క్రెడిట్ కార్డులకు మాత్రమే అనుమతినిచ్చింది.

ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ చేయాలంటే బ్యాంక్ ఖాతా యూపీఐతో లింక్ చేసుకుని చేసేవాళ్లు. అయితే క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్స్ చేసుకునే సౌలభ్యం కల్పించింది ఆర్బీఐ. ఆ క్రెడిట్ కార్డులకు మాత్రమే అనుమతినిచ్చింది.

యూజర్లకు గుడ్ న్యూస్.. UPI ద్వారా రూపే క్రెడిట్ కార్డు పేమెంట్స్ కి RBI అనుమతి

క్రెడిట్ కార్డ్స్ వినియోగించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. ధనిక, పేద అనే తేడా లేకుండా క్రెడిట్ కార్డ్స్ ను తీసుకుంటున్నారు. బ్యాంకులు సైతం వివిధ ఆఫర్లతో తక్కువ శాలరీలు ఉన్నవారికి కూడా క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. చేతిలో డబ్బులు లేనప్పుడు క్రెడిట్ కార్డులు ఉపయోగకరంగా మారడంతో ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ యూపీఐకి లింక్ చేయడం ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డుల ద్వారా కూడా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. అయితే అన్ని క్రెడిట్ కార్డులు కాదు. యూపీఐ ద్వారా రూపే-క్రెడిట్ కార్డుల లావాదేవీలు జరుపుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది.

ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. కిరాణా కొట్టు నుంచి మొదలుకొని షాపింగ్ మాల్స్ వరకు ఆన్ లైన్ చెల్లింపులే. అయితే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ తో యూపీఐ చెల్లింపులు చేయడంతో పాటు రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్స్ చేసుకునేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది. రూపే క్రెడిట్ కార్డు ఉంటే మీరు ఫోన్‌పే, గూగుల్‌పే, భారత్‌పే మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా యూనీఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)కు లింక్ చేసుకుని చెల్లింపులు చేయొచ్చు. బ్యాంకులో డబ్బులు లేకున్నా ఈ సౌలభ్యంతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఒకరి నుంచి మరొకరికి రూపే క్రెడిట్ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు.

UPI payments with Credit Card

భీమ్, ఫోన్‌పే, జీపే, పేజాప్, గోకివి, స్లైస్, పేటీఎం, మొబిక్విక్, భీమ్ పీఎన్బీ, కెనరా ఐయిల్, గ్రో, క్రెడ్, ఐసీఐసీఐ మొబైల్, జూపిటర్, శాంసంగ్ వాలెట్, నెవీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఫ్రీ చార్జ్, అమెజాన్ పే, ఫినో పే, నియో గ్లోబల్, ఎస్‌పే నెక్ట్స్, జియో ఫైనాన్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వ్యోమ్) వంటి యూపీఐ యాప్స్‌లో రూపే క్రెడిట్ కార్డు ఫీచర్ ఉంటుంది. క్రెడిట్ కార్డు హోల్డర్స్ తమ రూపే క్రెడిట్ కార్డును తమకు నచ్చిన యాప్ ద్వారా పేమెంట్స్ చేసేయొచ్చు. 16 బ్యాంకులకు యూపీఐపై రూపే క్రెడిట్ కార్డు లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది.

వాటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీవోబీ ఫైనాన్సియల్ లిమిటెడ్, ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ ఉన్నాయి. రూపే క్రెడిట్ కార్డుపై యూపీఐ ద్వారా ఒక రోజుకు రూ.లక్ష, మరికొన్ని స్పెషల్ ఎంసీసీ కోడ్స్ మీద రూ.2 లక్షల వరకూ చెల్లింపులు జరుపొచ్చు.