iDreamPost
android-app
ios-app

రాఖీ స్పెషల్: అంబానీ చెల్లెలు దీప్తి గురించి తెలుసా? ఈమె చాలా స్పెషల్!

  • Published Aug 20, 2024 | 2:25 PM Updated Updated Aug 20, 2024 | 2:25 PM

Mukesh Ambani's Sister Deepti life Story: రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంతేకాక ఆయన కుటుంబ సభ్యులైన భార్యా నీతా అంబానీ, పిల్లలు ఆకాశ్, అనంత్, ఈషా అంబానీలు కూడా అందరికీ తెలుసు. కానీ ఆయన చెల్లెలు దీప్తి అంబానీ గురించి చాలా మందికి తెలియదు.

Mukesh Ambani's Sister Deepti life Story: రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంతేకాక ఆయన కుటుంబ సభ్యులైన భార్యా నీతా అంబానీ, పిల్లలు ఆకాశ్, అనంత్, ఈషా అంబానీలు కూడా అందరికీ తెలుసు. కానీ ఆయన చెల్లెలు దీప్తి అంబానీ గురించి చాలా మందికి తెలియదు.

  • Published Aug 20, 2024 | 2:25 PMUpdated Aug 20, 2024 | 2:25 PM
రాఖీ స్పెషల్: అంబానీ చెల్లెలు దీప్తి గురించి తెలుసా? ఈమె చాలా స్పెషల్!

ప్రపంచ కుబేరు ఒకరు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన గురించి తెలుసా అంటే.. ఆయన గురించి తెలియని వారు ఉండరు.  అంతేకాక ఆయన కుటుంబ సభ్యులైన భార్యా నీతా అంబానీ, పిల్లలు ఆకాశ్, అనంత్, ఈషా అంబానీలు కూడా అందరికీ తెలుసు. అలానే ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ కూడా చాలా మందికి తెలుసు. కానీ అంబానీకి చెల్లెల్లు ఉన్నారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సోషల్ మీడియా, పబ్లిక్ పార్టీల్లో వారు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. తాజాగా ఆయన చిన్న చెల్లెలు దీప్తి అంబానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఆమె స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రముఖ భారతీయ వ్యాపార వేత్త అయినా ధీరుబాయ్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. ఆయన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అమ్మాయి నీనా కొఠారి కాగా చిన్న కుమార్తె దీప్తి సల్గోకర్.  ఆమె వీఎం సల్గొకర్ అండ్ బ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ దత్తరాజ్ సల్గోకర్ ను వివాహం చేసుకున్నారు. ఈ జంట గోవాలో ‘సునపరంతా గోవా సెంటర్’ అనే ప్రదర్శనశాలను నిర్వహిస్తున్నారు. ఈ దత్తరాజ్ సల్గొకర్ ..ముకేశ్ అంబాని, అనిల్ అంబానీలకు బాల్య స్నేహితుడు. ఆ పరిచయంతోనే దీప్తి అంబానీతో వివాహం జరిగింది. ఇక ఆయన విద్యాభ్యాసం గురించి చూసినట్లు అయితే.. వీజేటీఐ, బాంబే యూనివర్సిటీ నుంచి  ప్రొడక్షన్  ఇంజినీరింగ్ పూర్తి  చేశారు. ఆయన వన్యప్రాణి ఔత్సాహికుడు. అలానే ఆయనకు ఫోటోగ్రాఫి అంటే కూడా ఇష్టం. ఇక దత్తరాజ్ గోవా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీసీఐ బోర్డు సభ్యునిగా పనిచేసి క్రీడలలో కూడా  ఉన్నారు.

Mukesh ambani sister

ఇక ఆయన భార్య దీప్తీ సల్గోకర్ వీఎం సల్గోకర్ అండ్ బ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కార్పొరేట్ కమ్యునికేషన్ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీప్తి, దత్తరాజ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముఖేశ్ అంబానీల స్నేహం ద్వారా దీప్తి..దత్తరాజ్ కి పరిచయం ఏర్పడింది. తొలి చూపులోనే వారిమధ్య ప్రేమ చిగురించింది. అలా దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. చివరకు ఇరు కుటుంబాలకు తమ ప్రేమ విషయాన్ని చెప్పి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. 1983 డిసెంబర్ 31 దీప్తి, దత్తరాజ్ ల వివాహం జరిగింది. ఇక పెళ్లైన తరువాత  ఈ దంపతులు గోవాలకు షిప్ట్ అయ్యారు.

అప్పటి వరకు ముంబైలో స్థిరపడిన దీప్తి అంబానీ గోవా పరిస్థితులకు తట్టుకుని అక్కడ కొత్త జీవనం ప్రారంభించించింది. ముంబైలో ఉన్న తన లైఫ్ కి పూర్తి భిన్నంగా గోవాలో దీప్తి లైఫ్  ఉంది. ఇక ఈ దంపతులకు ఇషేత, విక్రం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ఇషేతకు అతుల్య మిట్టలతో జులై 2022లో వివాహం జరిగింది. కుమారుడు కూడా వారి వ్యాపారాల్లో నిమగ్నమయ్యాడు. మొత్తంగా అలా చాలా తక్కువగా మాత్రమే ముఖేస్ అంబానీ చెల్లెలు దీప్తి అంబానీ బయట ప్రపంచానికి తెలుసు. అలానే దీప్తి.. అంబానీ సోదరులు ఎంతో స్పెషల్. ఆమె అంటే వారికి ఎంతో ప్రేమ ఉంది. ప్రస్తుతం రాఖీ పండగ సందర్భంగా ముకేశ్ అంబానీ, ఆయన చెల్లెలు దీప్తి అంబానీ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్నాయి. మరి. ముకేశ్ అంబానీ చెల్లెలు దీప్తి అంబానీ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom