iDreamPost
android-app
ios-app

రాధిక మర్చంట్ అక్క గురించి ఎవరికైనా తెలుసా.. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే

  • Published Jul 12, 2024 | 6:56 PM Updated Updated Jul 12, 2024 | 6:57 PM

ఇంకొన్ని గంటల్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. కాగా, ఇప్పటికే వీరి వివాహనికి పలువురు సినీ ప్రముఖలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తాలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా అంబానీ ఇంటికి కోడలు అవుతున్న రాధిక మర్చంట్ కు ఒక అక్క ఉందాని ఎవరికైనా తెలుసా.. ఆమె ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.

ఇంకొన్ని గంటల్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. కాగా, ఇప్పటికే వీరి వివాహనికి పలువురు సినీ ప్రముఖలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తాలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా అంబానీ ఇంటికి కోడలు అవుతున్న రాధిక మర్చంట్ కు ఒక అక్క ఉందాని ఎవరికైనా తెలుసా.. ఆమె ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Jul 12, 2024 | 6:56 PMUpdated Jul 12, 2024 | 6:57 PM
రాధిక మర్చంట్ అక్క  గురించి ఎవరికైనా తెలుసా.. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే

ప్రస్తుతం ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్న్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కాగా, నేడు రాత్రి 8 గంటలకు మేకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట లు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. కాగా, ఈ పెళ్లికి ఇప్పటికే హాలివుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఈ వివాహ వేడుకలకు ముంబై చేరుకున్నారు. ఇక మరోవైపు అనంత్, రాధికలా పెళ్లి ఊరేగింపు కూడా స్టార్ట్ అయ్యింది.ఇక ఈ వివాహం కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. అంబానీ ఇంట్లో కోడలిగా అడుగుపెడుతున్న రాధిక మర్చంట్ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. ఎంతైనా అంబానీ ఇంట చిన్న కోడలు కాబట్టి ఇక ఆమె ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా రాధిక మర్చంట్ సోదరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకి రాధిక మర్చంట్ సోదరి ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. రాధిక మర్చంట్ అక్క పేరు అంజలి మర్చంట్. ఈమె  తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్రలు పోషిస్తుంది. ముఖ్యంగా ఈమె  తండ్రి విరేన్ మర్చంట్ ఫార్మా పరిశ్రమలో ప్రపంచ కాంట్రాక్ట్ అయినా ఎన్‌కోర్ హెల్త్‌కేర్ (EHPL) వ్యవస్థాపకుడు, CEO  కావడం గమన్హారం. ఇక EHPL కంపెనీలో అంజలి, రాధిక ఇద్దరు బోర్డు డైరెక్టర్ పదవులను కలిగి ఉన్నారు. అలాగే తన తండ్రి వ్యాపారంలో ఈ ఇద్దరు అక్క చెల్లెల్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే  రాధిక అక్క అంజలి EHPL కంపెనీలో మొదట్లో జనరల్ మేనేజర్ – బిజినెస్ డెవలప్‌మెంట్‌గా చేరి, ఆ తర్వాత మేనేజర్ – మార్కెటింగ్, క్లయింట్ ఔట్రీచ్ ఎగ్జిక్యూటివ్‌గా రాణించారు.

ఈ క్రమంలోనే.. 2021లో EHPL అభివృద్ది, విస్తరణ స్ట్రీరింగ్ చేయడంలో ఆమె ఆలోచనలతో సుస్థిరం చేయడంతో.. ఆమె బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా మారారు. అంతేకాకుండా అంజలి.. ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే  మైలూన్ మెటల్స్ స్థాపించి అలియా భట్, టబు వంటి ప్రముఖులచే ప్రోత్సహించబడిన హెయిర్ స్టైలింగ్, ట్రీట్మెంట్ క్లబ్ సీఓఓగా గుర్తింపు పొందింది. ఇక అంజలి ముంబైలోని ది కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత విదేశాలలో ఉన్న విద్యను అభ్యసించింది. అనంతరం  మసాచుసెట్స్‌లోని బాబ్సన్ కాలేజీ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పట్టా పొందింది. అలాగే లండన్ బిజినెస్ స్కూల్ నుంచి MBA సంపాదించింది. ఈ క్రమంలోనే.. విద్యావిషయక కార్యక్రమాలలో ట్రాన్స్‌ఫార్మేటివ్ సెమిస్టర్ ఎట్ సీ ప్రోగ్రామ్ పూర్తి చేసింది. అంతేాకాకుండా.. 12 దేశాలలో విభిన్న సంస్కృతుల గురించి అధ్యానయం చేసింది.

అయితే ఈ అనుభవమే  గ్లోబల్ ఎకనామిక్స్, లాంగ్వేజెస్, ఇంటర్నేషనల్ స్టడీస్‌పై ఆమె అవగాహనను సుసంపన్నం చేసింది. అలా తనదైన చాకచక్యంతో బిజినెస్ రంగంల్లో దూసుకుపోతుంది. ఇకపోతే అంజలి 2020లో ప్రముఖ వ్యాపారవేత్త అమన్ మజిథియాను వివాహం చేసుకుంది . కాగా, ప్రస్తుతం  వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే ఈమె భర్త అమన్ మజిథియా EHPL కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే కంపెనీలోని CMO యూనిట్ కార్యాచరణ అంశాలను చూసుకుంటారు. ఇక అంజలి నికర విలువ సుమారు రూ.2000 కోట్లకు పైగానే ఉంటుంది. మరి, రాధిక మర్చంట్ అక్క అంజలి మర్చంట్ వ్యాపార నేపథ్యం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Meera Sakhrani (@meerasakhrani)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss