iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ Bank సంచలన నిర్ణయం.. ఆ పని చేయకపోతే ఖాతాలన్నీ క్లోజ్!

ప్రభుత్వ రంగ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ పని చేయకపోతే ఆ అకౌంట్లన్నీ క్లోజ్ చేస్తామని వెల్లడించింది. మరి మీకు ఆ బ్యాంక్ లో ఖాతా ఉందేమో చెక్ చేసుకోండి.

ప్రభుత్వ రంగ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ పని చేయకపోతే ఆ అకౌంట్లన్నీ క్లోజ్ చేస్తామని వెల్లడించింది. మరి మీకు ఆ బ్యాంక్ లో ఖాతా ఉందేమో చెక్ చేసుకోండి.

ప్రభుత్వ Bank సంచలన నిర్ణయం.. ఆ పని చేయకపోతే ఖాతాలన్నీ క్లోజ్!

సంపాదించిన సంపాదనలో కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో దాచుకోవాలంటే అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు ఏదైనా వ్యాపారం చేయాలని భావిస్తే.. పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందాలంటే ఖాతా ఉండాల్సిందే. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా కూడా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. అయితే వివిధ అవసరాల కోసం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏదో ఒక ఖాతానే వినియోగిస్తూ మిగతా ఖాతాలతో ట్రాన్సాక్షన్స్ జరపకుండా వదిలేస్తున్నారు. ఇలాంటి వారికి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ షాకిచ్చింది. ఖాతాదారులు ఆ పని చేయకపోతే అకౌంట్లన్నీ క్లోజ్ చేస్తామని ప్రకటించింది.

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ను ఇచ్చింది. గత మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని అకౌంట్లను క్లోజ్ చేస్తామని ప్రకటించింది. ఖాతాలు యాక్టివ్ గా ఉండాలంటే రెగ్యూలర్ గా ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే అకౌంట్ ఇనాక్టివ్ లోకి వెళ్లి క్లోజ్ అవుతుంది. అదే విధంగా బ్యాంక్ రూల్స్ ప్రకారం.. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ క్రమంలో మూడేళ్లుగా ఎలాంటి ట్రాన్సాక్షన్లు జరపని, బ్యాలెన్స్ లేని ఖాతాలను పూర్తి స్థాయిలో మూసి వేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్ణయించినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా పీఎన్ బీ పోస్ట్ చేసింది. దీనికి సంబంధించి నోటీస్ ప్రచురించిన నెల రోజుల తర్వాత ఇనాక్టివ్ ఖాతాలను క్లోజ్ చేస్తామని తెలిపింది. ఏప్రిల్ 30, 2024 నుంచి నెలరోజులు పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది.

బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాదారులు వెంటనే ట్రాన్సాక్షన్స్ ప్రారంభించి ఖాతాను యాక్టివ్ స్టేట్ లోకి తీసుకురావాలి. లేదంటే అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఒక వేళ మీకు ఆ ఖాతాతో పనిలేదనుకుంటే వదిలేసుకోవచ్చు. కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి యాక్టివేట్ చేయకపోతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అకౌంట్ క్లోజ్ చేస్తామని తెలిపింది. మూడేళ్లుగా ట్రాన్సాక్షన్స్ జరపని, బ్యాలెన్స్ కూడా లేని ఖాతాలను దుర్వినియోగం చేయకుండా కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎన్ బీ వెల్లడించింది. అయితే, కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందిన ఖాతాలను మూసివేయబోమని తెలిపింది. ఆ జాబితాలో స్టూడెంట్ అకౌంట్స్, మైనర్ల ఖాతాలు, పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై, ఎస్ఎస్‌వై, ఏపీఐ వంటి నోటీస్ లో పేర్కొన్న ఇతర అకౌంట్లను క్లోజ్ చేయబోమని తెలిపింది.