iDreamPost
android-app
ios-app

అదిరిపోయే బిజినెస్ ఐడియా.. కేవలం రూ.70 వేల పెట్టుబడితో ప్రతి నెలా రూ.30,00 ఆదాయం

  • Published Jan 01, 2024 | 3:03 PM Updated Updated Jan 01, 2024 | 5:16 PM

వ్యాపారం చేయాలని ఉన్నా పెట్టుబడి, వేలల్లో రెంట్ కు భయపడి ఆ ఆలోచన మానుకుంటున్నారా.. మీలాంటి వారి కోసమే ఈ సింపుల్, రిస్క్ లేని బిజినెస్ ఐడియా. కేవలం 70 వేల రూపాయల పెట్టుబడితో నెలకు 30 వేలు సంపాదించవచ్చు. ఆ వివరాలు..

వ్యాపారం చేయాలని ఉన్నా పెట్టుబడి, వేలల్లో రెంట్ కు భయపడి ఆ ఆలోచన మానుకుంటున్నారా.. మీలాంటి వారి కోసమే ఈ సింపుల్, రిస్క్ లేని బిజినెస్ ఐడియా. కేవలం 70 వేల రూపాయల పెట్టుబడితో నెలకు 30 వేలు సంపాదించవచ్చు. ఆ వివరాలు..

  • Published Jan 01, 2024 | 3:03 PMUpdated Jan 01, 2024 | 5:16 PM
అదిరిపోయే బిజినెస్ ఐడియా.. కేవలం రూ.70 వేల పెట్టుబడితో ప్రతి నెలా రూ.30,00 ఆదాయం

ఒకరి కింద పని చేయడం కన్నా.. మనమే మరో నలుగురికి పని కల్పించడమే కాక సొంతంగా ఆదాయం పొందాలనుకునే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతుంది. అయితే బిజినెస్ చేయాలనే కోరిక ఉంటే సరిపోదు.. దాన్ని ప్రారంభించాలంటే.. భారీగా పెట్టుబడి కావాల్సి ఉంటుంది. నగరాల్లో ఏదైనా వ్యాపారం చేయాలంటే.. అద్దె వేలు, లక్షల్లో ఉంటుంది. అందుకే చాలా మంది సామాన్యులు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా.. పెట్టుబడికి జడిసి.. బిజినెస్ ఆలోచన విరమించుకుంటారు. మీరు కూడా ఈ కోవకు చెందిన వాళ్లే అయితే.. మీకోసమే ఈ బిజినెస్ ఐడియా. తక్కువలో తక్కువ 70 వేల రూపాయల పెట్టుబడితో నెలకు 30-35 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.

అలానే ఈ వ్యాపారం ప్రారంభించిన తర్వాత రాబడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బిజినెస్ ప్రారంభించిన ఫస్ట్ డే నుంచే.. సంపాదన మొదలవుతుంది. పైగా పని వేళలను కూడా మీరు మీకు నచ్చినట్లు నిర్ణయించుకోవచ్చు. 70 వేల రూపాయల పెట్టుబడి పెడితే.. మీరు ఈజీగా నెలకు 30 వేల రూపాయలకు పైగానే సంపాందిచుకోవచ్చు. రెంట్ కష్టాలుండవు. ఇంతకు ఏంటా బిజినెస్ ఐడియా అంటే.. క్యాబ్ సేవలు. ఉరుకుల పరుగుల జీవితంలో.. మన సమయంతో పాటు పరుగులు తీయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ఆలస్యం అయినా నష్టమే. ఇక ఉద్యోగం నిమిత్తం ఆఫీసులకు వెళ్లే వారు అయితే.. పది నిమిషాలు లేట్ అయినా సరే హైరానా పడతారు.

30,000 income per month with an investment of 70 thousand

బస్సుల కోసం వేచి చూసి.. ట్రాఫిక్ లో ఇరుక్కుని.. ఇబ్బంది పడే కన్నా.. ప్రైవేట్ క్యాబ్ లో వెళ్తే బెటర్ అనుకుంటారు. ప్రస్తుతం వీటిల్లో కార్లతో పాటు బైక్ లు కూడా ఈ సేవలు అందిస్తున్నాయి. కారు బుక్ చేసుకుంటే డబ్బులు ఎక్కువగా చెల్లించాల్సి రావడమే కాక.. ట్రాఫిక్ లో త్వరగా వెళ్లే అవకాశం ఉండదు. అదే టూ వీలర్ అయితే ధర తక్కువ.. పైగా త్వరగా వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర ఓలా, ఉబర్, రాపిడో వంటివి ప్రైవేట్ టూవీలర్ సేవలను అందిస్తున్నాయి.

మరి వీటి ద్వారా మీరు ఆదాయం ఎలా పొందుతారంటే.. మీ బైక్ ను ఈ సర్వీసుల్లో కనెక్ట్ చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. మీ దగ్గర బైక్ ఉన్నా.. లేదంటే ఇప్పుడు కొన్నా సరే.. దాన్ని వీటిల్లో కనెక్ట్ చేయడం ద్వారా.. మీరుప్రతి నెలా 30 వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇక ఇక్కడ పెట్టుబడి అనేది మీ దగ్గర ఉన్న బండి కాస్ట్ అవుతుంది. ఇందుకు మీకు కనిష్టంగా 75 వేల రూపాయల వరకు అవసరం అవుతుంది.

నెలకు 30 వేలు ఎలా సంపాదించవచ్చు అంటే..

ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల్లో.. ఓలాతో లింకప్ అవ్వడం వల్ల ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు అంటున్నారు. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల్లో కారుతో పోల్చితే.. ఆటో, బైక్ ఛార్జీలు తక్కువగా ఎంటాయి. అలానే ట్రాఫిక్ లో ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేదు. కనక ఈ మధ్య కాలంలో చాలా మంది టూవీలర్ సర్వీసులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 10-12 కిలోమీటర్ల దూరానికి 100 రూపాయల వరకు పొందవచ్చు.

ఇలా మీరు గరిష్టంగా రోజుకు 10 రైడ్ లు తీసుకుంటే.. మీకు 1000 రూపాయల ఆదాయం వస్తుంది. దీనిలో పెట్రోల్ ఖర్చు 150-200 రూపాయల వరకు ఉంటుంది. మిగిలిన ఇతర ఖర్చు తీసేస్తే.. రోజుకు 700-800 ఆదా అవుతుంది. పీక్ అవర్స్ లో ఛార్జీలు కూడా పెరుగుతాయి. అలా మొత్తం మీద మీరు రోజుకు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. అలా చూసుకుంటే నెలకు 30 వేల రూపాయలు అవుతుంది. దీనిలో నికర పొదుపు 2124 వేల రూపాయలు అవుతుంది. ఛార్జీలు పెరిగితే.. మీకు ఆదాయం కూడా పెరుగుతుంది. పైగా మీరు మీకు అనువైన సమయంలో ఈ వ్యాపారం చేసుకోవచ్చు.

ప్రైవేట్ క్యాబ్ సర్వీస్ లో బైక్ అటాచ్ మెంట్

ఇందుకోసం మీరు సంబంధింత వెబ్ సైట్ ను సందర్శించాలి. ఆ తర్వాత వెహికల్ పేపర్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఇతర ముఖ్యమైన పత్రాలతో మీ వాహనాన్ని ప్రైవేట్ క్యాబ్ సేవలను అందించే కంపెనీతో కనెక్ట్ చేయవచ్చు.