iDreamPost

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

ఓ వైపు పండగల సీజన్ మరొవైపు పెళ్లి ముహూర్తాలు ఉండడంతో బంగారం కొనే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలో బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఊహించని షాక్ తగులుతోంది. నేడు మార్కెట్ లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతూ కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలు బంగారం ధరలు పెరుగుటకు కారణం అవుతున్నాయి. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 250 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 52 వేల 750 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 310 పెరిగడంతో తులం బంగారం ధర రూ. 57 వేల 540 వద్ద అమ్ముడవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ. 52 వేల 900 వద్దకి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 310 పెరిగి రూ. 57 వేల 690 వద్ద కొనసాగుతోంది.

ఓవైపు బంగారం ధరలు పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తుండగా వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. ఊహించని రీతిలో కిలో వెండి ధర రూ. 2వేలు పెరిగి ముక్కున వేలేసుకునేలా చేసింది. నేడు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ.2వేలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75 వేలకు చేరింది. హస్తినలో కిలో వెండి ధర రూ.1500 పెరిగి రూ. 72 వేల 100 వద్ద అమ్ముడవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి