iDreamPost
android-app
ios-app

బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్! 5 లక్షలు కడితే 10 లక్షలు! కేంద్రం హామీ కూడా!

  • Published Jul 19, 2024 | 7:28 PM Updated Updated Jul 19, 2024 | 7:28 PM

కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోస్టాఫీసు ద్వారా ఎన్నో రకాల సేవింగ్స్ స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో చిన్న మొత్తాల పొదుపు పథకాల దగ్గర నుంచి దాదాపు అన్ని వర్గాల వారి కోసం కొన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పోస్టాఫీసులో పెట్టుబడి డబుల్ చేసే బెస్ట్ సేవింగ్స్ స్కీమ్స్ అనేది అందుబాటులోకి వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోస్టాఫీసు ద్వారా ఎన్నో రకాల సేవింగ్స్ స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో చిన్న మొత్తాల పొదుపు పథకాల దగ్గర నుంచి దాదాపు అన్ని వర్గాల వారి కోసం కొన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పోస్టాఫీసులో పెట్టుబడి డబుల్ చేసే బెస్ట్ సేవింగ్స్ స్కీమ్స్ అనేది అందుబాటులోకి వచ్చింది.

  • Published Jul 19, 2024 | 7:28 PMUpdated Jul 19, 2024 | 7:28 PM
బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్! 5 లక్షలు కడితే 10 లక్షలు! కేంద్రం హామీ కూడా!

ఈరోజుల్లో డబ్బు లేనిదో ఎవరికి విలువ ఉండదు. ఎందుకంటే.. ఇప్పుడు ప్రతిది డబ్బుతోటే ముడిపడి ఉంటుంది. కనుక అది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికే ఎక్కువ మర్యాద ఇస్తుంటారు. కానీ, ప్రస్తుత కాలంలో ఆ డబ్బు సంపాదించడానికి ప్రతిఒక్కరూ చాలా కష్టలు పడుతున్నారు. ముఖ్యంగా ఇలా సంపాదించిన దాంట్లో భవిష్యత్తు కోసం ఆలోచించి చిన్న చిన్న పొదుపు చేయాలని చాలామంది ఆలోచన చేస్తుంటారు. యితే ఈరోజుల్లో పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలున్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేకుండా.. మంచి రాబడులు వచ్చే స్కీమ్స్ లో నగదును పొదుపు చేయాలని చూస్తారు. మరి, అలాంటి వాటిలో ప్రభుత్వ సెక్యూరిటీ కలిగిన పోస్టాఫీస్ స్కీమ్స్ అనేవి బెస్ట్ అనే చెప్పావచ్చు. ఎందుకంటే.. ఈ పోస్టాఫీసు స్కీమ్స్ లో ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా పెట్టిన పెట్టుబడుల్లో డబుల్ పెట్టుబడులు అందించే స్కీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా పోస్టాఫీసులో డబులు పెట్టుబడి కావలనుకునే వారికి మరో కొత్త స్కీమ్ అనేది అందుబాటులో ఉంది. ఇంతకీ ఆ పథకం ఏంటంటే..

కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోస్టాఫీసు ద్వారా ఎన్నో రకాల సేవింగ్స్ స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో చిన్న మొత్తాల పొదుపు పథకాల దగ్గర నుంచి దాదాపు అన్ని వర్గాల వారి కోసం కొన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లకు కూడా సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, రిటైర్మెంట్ ఫండ్స్ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. అయితే అలాంటి వాటిలో లాంగ్ టర్మ్ లో అద్భుతమైన రాబడి అందించే మరో పథకం కిసాన్ వికాస్ పత్ర. ఈ పథకంలో ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా గ్యారెంటీ రిటర్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా.. దీంట్లో ఎంత పెట్టుబడి పెట్టినా సరిగ్గా 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతాయి. అయితే దీంట్లో కనీస రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఎలాంటి పరిమితి లేదు.

అయితే ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో సింగిల్ అకౌంట్ కూడా తెరవచ్చు. దీంతో పాటు ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరిచుకోవచ్చు. ఇక ఈ స్కీమ్ లో వడ్డీ రేటు ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన 7.50 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఓసారి ఈ స్కీమ్ వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. పైగా ఇందులో వడ్డీ రేటు పెరగొచ్చు, తగ్గొచ్చు. స్థిరంగా కూడా ఉండొచ్చు.ఇక ఈ పథకంలో మీరు 115 నెలలు, 9 ఏళ్ల 7 నెలల్లో పెట్టుబడిని డబుల్ చేసుకోవచ్చు.అంటే రూ. లక్ష పెట్టుబడి పెడితే నిర్దిష్ట వడ్డీ ప్రకారం.. ఇంత కాలంలో అది రూ. 2 లక్షలు అవుతుంది. అలాగే రూ.5 లక్షలు పెడితే.. అది కాస్త రూ.10 లక్షలుగా, రూ.20 లక్షలు పెడిగే రూ.40 లక్షలు గా డబుల్ అవుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్న పథకం కాబట్టి అసలు ఎలాంటి రిస్క్‌కు అవకాశమే లేదు. పైగా చిన్న మొత్తంలోని డిపాజిట్లతో ఈ స్కీమ్ లో చేరవచ్చు.

ఇకపోతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80c టాక్స్ బెనిఫిట్స్ ఈ స్కీంలో లేవు. అందుకే మెచ్యూరిటీ నగదు మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక అకౌంట్ హోల్డర్ చనిపోవడం, ఇతర ఏదైనా సందర్భాల్లో కోర్డ్ ఆర్డర్‌ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన రెండేళ్ల 6 నెలల తర్వాత ముందుగానే వైదొలగవచ్చు. ఈ స్కీమ్ కింద లోన్ కూడా తీసుకోవచ్చు. బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అడ్రస్ ప్రూఫ్ సహా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి కేవైసీ డాక్యుమెంట్స్ అవసరం పడతాయి. ఒక ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ఇస్తే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మరి, పోస్టాఫీసులో డబుల్ పెట్టుబడి అందించే ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking