iDreamPost
android-app
ios-app

UPI సేవలు మరింత సులభం.. Bank అకౌంట్ లేకుండానే పేమెంట్స్!

  • Published Feb 28, 2024 | 10:56 AM Updated Updated Feb 28, 2024 | 10:56 AM

యూపీఐ పేమెంట్స్ మరింత సులభం కానున్నాయి. బ్యాంక్ అకౌంట్ తో సంబంధం లేకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

యూపీఐ పేమెంట్స్ మరింత సులభం కానున్నాయి. బ్యాంక్ అకౌంట్ తో సంబంధం లేకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

  • Published Feb 28, 2024 | 10:56 AMUpdated Feb 28, 2024 | 10:56 AM
UPI సేవలు మరింత సులభం.. Bank అకౌంట్ లేకుండానే పేమెంట్స్!

డిజిటల్ పేమెంట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక చెల్లింపులు సులభమైపోయాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ఆన్ లైన్ లావాదేవీలను సులభతరం చేసింది. చేతిలో చిల్లిగవ్ల లేకపోయినా బ్యాంక్ అకౌంట్ లో నగదు ఉంటే చాలు యూపీఐ సాయంతో ట్రాన్సాక్షన్స్ చేసుకునే వీలు ఏర్పడింది. డిజిటల్ పేమెంట్స్ యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటిని ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు. ఈ యాప్స్ లో బ్యాంక్ అకౌంట్ ను అనుసంధానం చేసుకుని ఆన్ లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు యూపీఐ సేవలు మరింత సులభం కానున్నాయి. బ్యాంక్ ఖాతాతో పని లేకుండా చెల్లింపులు చేసేలా ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సౌలభ్యాన్ని మొబిక్విక్ ప్రవేశ పెట్టింది.

మీరు ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తారా? అయితే ఇప్పుడు మీ అకౌంట్ ను లింక్ చేయకుండానే చెల్లింపులు చేసేయొచ్చు. దీనికి సంబంధించిన సరికొత్త ఫీచర్ ను దేశీయ పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ మొబీక్విక్‌ తీసుకొచ్చింది. బ్యాంక్ అకౌంట్ తో అనుసంధానం లేకుండానే పేమెంట్స్ జరిపేలా పాకెట్ యూపీఐ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాకెట్ యూపీఐ ఫీచర్ తో బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకుండానే మొబీక్విక్‌ వ్యాలెట్‌ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. బ్యాంక్ ఖాతాకు బదులు వాలెట్ కు నిధులు బదిలీ చేయడం ద్వారా ఆర్థిక లావాదేవీలను క్రమబద్దీకరిస్తుందని సంస్థ తెలిపింది. బ్యాంక్‌ ఖాతా నుంచి నిధుల బదిలీ కంటే మొబీక్విక్‌ వ్యాలెట్‌ నుంచి బదిలీయే సురక్షితమని, ఆర్థిక మోసాలకు అవకాశం ఉండదని మొబీక్విక్‌ వెల్లడించింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom