iDreamPost
android-app
ios-app

HYDలో స్థలాల రేట్లు మరీ ఇంత తక్కువా? 19 లక్షలకే 2 BHK ప్లాట్!

  • Published Apr 25, 2024 | 3:35 PM Updated Updated Apr 25, 2024 | 3:35 PM

మియాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలకు దగ్గరలో.. సైబరాబాద్ కి, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో.. ముంబై హైవే మీద 20 లక్షలోపు 100 గజాల స్థలం దొరుకుతుందంటే నమ్ముతారా? కానీ నిజం.

మియాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలకు దగ్గరలో.. సైబరాబాద్ కి, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో.. ముంబై హైవే మీద 20 లక్షలోపు 100 గజాల స్థలం దొరుకుతుందంటే నమ్ముతారా? కానీ నిజం.

HYDలో స్థలాల రేట్లు మరీ ఇంత తక్కువా? 19 లక్షలకే 2 BHK ప్లాట్!

హైదరాబాద్ లో స్థలాల రేట్లు తక్కువగా దొరికే ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాకపోతే సిటీ మధ్యలోనే కావాలంటే రావు. కానీ ఒక 20, 30 కిలోమీటర్ల అవతలకి వెళ్తే 20 లక్షల్లో 2 బీహెచ్కే ఇంటికి సరిపడా స్థలం దొరుకుతుంది. ఆ ఏరియా శంకరపల్లి. మాదాపూర్ నుంచి 33 కిలోమీటర్లు, గచ్చిబౌలి నుంచి 30 కిలోమీటర్లు, మియాపూర్ నుంచి 31 కిలోమీటర్లు, హైటెక్ సిటీ నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఏరియాలో ప్రస్తుతం చదరపు అడుగు 1900 రూపాయలుగా ఉంది. అంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోయే 1 బీహెచ్కే ఇంటి స్థలం కొనాలంటే 600 చదరపు అడుగులకు 12 లక్షలు అవుతుంది. అదే 2 బీహెచ్కే స్థలం కొనాలంటే 1000 చదరపు అడుగులకు 19 లక్షలు అవుతుంది. 

గజాల్లో చెప్పాలంటే గజం స్థలం రూ. 17,100 నుంచి ఉన్నాయి. అంటే 100 గజాల స్థలానికి 17 లక్షలు అవుతుంది. అదే 150 గజాల స్థలానికి 26 లక్షలు అవుతుంది. యావరేజ్ చదరపు అడుగు స్థలం రేటు ఇక్కడ 2,290 రూపాయలుగా ఉంది. అసలు శంకరపల్లిలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? అంటే అనేక కారణాలు ఉన్నాయి. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో పెట్టుబడికి అనువైన ప్రాంతంగా ఈ శంకరపల్లి ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతుండడం, సరసమైన ధరలకు ప్రాపర్టీ దొరుకుతుండడం, వ్యూహాత్మక ఏరియాగా ఉండడం వంటి కారణాలు ఉన్నాయి. సైబరాబాద్ కి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. అంతేకాదు ఈ ఏరియా హైదరాబాద్-ముంబై హైవే మీద ఉన్న కారణంగా కమర్షియల్ హబ్స్ కి ఈజీ యాక్సెస్ ఉంటుంది.

20 lakhs under plot

సిటీలోపలకి వెళ్లాలన్నా.. సిటీ చుట్టుపక్కలకు వెళ్లాలన్నా కూడా స్ట్రాంగ్ కనెక్టివిటీ ఉంది. విద్యాసంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, హెల్త్ కేర్ సంస్థలు, ఎంటర్టైన్మెంట్ హబ్స్ వంటివి ఉన్నాయి. హైదరాబాద్ ఫార్మా సిటీ, రానున్న రీజనల్ రింగ్ రోడ్ వంటి మేజర్ ప్రాజెక్ట్స్ సహా ఇతర ప్రాజెక్టులతో శంకరపల్లి వేగవంతంగా డెవలప్ అవుతుంది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల కనెక్టివిటీ అనేది మెరుగుపడి ప్రయాణ దూరాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా శంకరపల్లి రెసిడెన్షియల్ ఏరియాగా అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. సిటీలో ఉన్న మిగతా ఏరియాలతో పోలిస్తే శంకరపల్లిలో స్థలాల రేట్లు తక్కువగా ఉన్నాయి. సరసమైన ధరలకు అందుబాటులో ఉండడం వల్ల ఇది పెట్టుబడికి అనువైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఇక్కడ పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరిగి.. పెట్టిన పెట్టుబడి మీద ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.