iDreamPost
android-app
ios-app

మార్కెట్ లోకి సరికొత్త వెస్పా స్కూటర్‌.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది

  • Published Jul 02, 2024 | 7:37 PM Updated Updated Jul 02, 2024 | 7:37 PM

Vespa 946 Dragon Edition: మార్కెట్ లోకి సరికొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. పియాజియో గ్రూప్‌ సరికొత్త వెస్పా స్కూటర్‌ను విడుదల చేసింది. వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.

Vespa 946 Dragon Edition: మార్కెట్ లోకి సరికొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. పియాజియో గ్రూప్‌ సరికొత్త వెస్పా స్కూటర్‌ను విడుదల చేసింది. వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.

  • Published Jul 02, 2024 | 7:37 PMUpdated Jul 02, 2024 | 7:37 PM
మార్కెట్ లోకి సరికొత్త వెస్పా స్కూటర్‌.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది

మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు లేటెస్ట్ వర్షన్ లతో టూవీలర్స్ ను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అద్భుతమైన డిజైన్, క్రేజీ ఫీచర్లతో టూవీలర్స్ ను తయారు చేస్తున్నాయి. టెక్నాలజీని ఉపనయోగించుకుని కస్టమర్లకు బైక్స్, స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి టూవీలర్ తయారీ కంపెనీలు. తాజాగా మరో కొత్త స్కూటర్ మార్కెట్ లోకి విడుదలైంది. ఇటాలియన్ మోటార్ కంపెనీ పియాజియో గ్రూప్‌ సరికొత్త వెస్పా స్కూటర్‌ను విడుదల చేసింది. వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్‌ను విడుదల చేసింది కంపెనీ. ఇక ఈ స్కూటర్ లుక్ పరంగా అదరగొడుతున్నప్పటికీ ధర చూస్తే మాత్రం దిమ్మతిరిగిపోతుంది. ఇంతకీ ఈ స్కూటర్ ధర ఎంతంటే?

వెస్పా 946 డ్రాగన్ ధర విషయానికి వస్తే.. భారత మార్కెట్ లో దీని ధర రూ. రూ.14.28 లక్షలు. అంటే ఈ స్కూటర్ ను కొనే ధరకు ఓ కారును కొనుగోలు చేసుకోవచ్చు. డ్రాగన్ లుక్ లో ఉన్న ఈ స్కూటర్ వాహనదారులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ స్కూటర్‌ను ప్రపంచవ్యాప్తంగా 1888 యూనిట్లు మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్‌లో.. ముందు, వెనుక 12 అంగుళాల చక్రాలు, 220ఎంఎం డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 150 సిసి ఎయిర్ కూల్డ్ ఇంజన్ 12.7బిహెచ్‌పి పవర్, 12.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ వెస్పా స్కూటర్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ గోల్డ్ కలర్‌, గ్రీన్ కలర్ రంగులో డ్రాగన్‌ అందుబాటులో ఉంది. కంపెనీ నుండి ఈ స్కూటర్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు పరిమిత ఎడిషన్ వెస్పా డ్రాగన్ వర్సిటీ జాకెట్ కూడా ఇవ్వబడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పియాజియో మోటోప్లెక్స్ షోరూమ్‌లలో వినియోగదారుల కోసం ఈ స్కూటర్ బుకింగ్ ప్రారంభమైంది. లుక్ కోసం చూసే వారికి ఈ స్కూటర్ బాగుంటుంది. కానీ ధర చూస్తేనే కొనలేని పరిస్థితి ఉంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio