iDreamPost
android-app
ios-app

బ్యాంక్ కి వెళ్ళే పనిలే.. ఇలా Phone Peలో ఈజీగా లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

  • Published Nov 08, 2024 | 3:37 PM Updated Updated Nov 08, 2024 | 3:37 PM

Phone pe: బ్యాంకుకి వెళ్ళే పని లేకుండా లోన్ కావాలనుకునే వారికి సూపర్ ఆప్షన్ ఉంది. అదే ఫోన్ పే లోన్.

Phone pe: బ్యాంకుకి వెళ్ళే పని లేకుండా లోన్ కావాలనుకునే వారికి సూపర్ ఆప్షన్ ఉంది. అదే ఫోన్ పే లోన్.

బ్యాంక్ కి వెళ్ళే పనిలే.. ఇలా Phone Peలో ఈజీగా లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

మనకి ఏదైనా లోన్ కావాలంటే కచ్చితంగా బ్యాంకులకి వెళతాము. కానీ ఆ అవసరం లేకుండా ఈజీగా లోన్ పొందే మార్గం ఒకటి ఉంది. అది కూడా మన చేతిలోనే ఉంది. అదే ఫోన్ పే. మనం చాలా కాలంగా PhonePe వాడుతున్నాము. కానీ మనలో చాలా మందికి కూడా ఫోన్ పే లోన్ ఆఫర్ చేస్తుందనే విషయం తెలీదు. అందువల్ల ఈ ఫీచర్ ని సరిగ్గా వినియోగించుకోలేక పోతున్నారు. మీరు ఎలాంటి బ్యాంక్స్ ,ఫైనాన్స్ కంపెనీలకు వెళ్ళకుండా ఫోన్ పే లో పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. లోన్ అంటే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 లక్షల వరకు మీరు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. చాలా స్పీడ్ గా మీరు లోన్ పొందవచ్చు. కేవలం 5 నిమిషాల్లోనే లోన్ పొందవచ్చు. ఇంకో మంచి విషయం ఏమిటంటే.. ఇందులో ఈజీగా EMI కట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇక ఫోన్ పే లో ఎలా లోన్ తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో ఫోన్ పే యాప్‌ని ఓపెన్ చేయండి. మీరు ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయగానే పైన మీకు కొన్ని స్లైడ్స్ కనిపిస్తాయి. అందులో మీకు “loans” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్లి, ప్రిఫర్ Personal Loan ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోని క్లిక్ చేయండి. మీకు ఎంత లోన్ కావాలో అంత లోన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తరువాత మీకు అనుకూలంగా మీకు సరిపోయే EMI ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. లోన్ తీసుకునేటప్పుడు కచ్చితంగా రూల్స్ , కండిషన్స్ గురించి కచ్చితంగా తెలుసుకోండి. వాటిని పూర్తిగా చదివిన తరువాత మాత్రమే లోన్ తీసుకోండి. అందులో అడిగిన వివరాలను కచ్చితంగా ఇవ్వండి. అలాగే ఏవైనా అవసరమైన డాక్యుమెంట్స్ ని కూడా ప్రూఫ్ గా ఇవ్వండి. అవి వెరిఫై అయ్యాక మీకు లోన్ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది.ఈ ఫీచర్ PhonePe వినియోగదారులకు చాలా ఉపయోగ పడుతుందనే చెప్పాలి. దీని వల్ల మనకు అవసరం అయినప్పుడు బ్యాంకుకి వెళ్ళే అవసరం లేకుండా చాలా ఈజీగా లోన్ పొందవచ్చు.

ఈ ఇన్స్టంట్ లోన్ ఆప్షన్ ద్వారా మనం 25 వేల నుంచి 5 లక్షల దాకా లోన్ పొందవచ్చు. దీని కోసం ఫోన్‌పే ప్రిఫర్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రిఫర్ అనే సంస్థ హీరో ఫిన్ కార్ప్ సహా పలు ఇతర లెండింగ్ సంస్థలతో టై అప్ అయ్యింది. వీటి ద్వారా కస్టమర్లకు లోన్లు అందిస్తోంది. ఇలా ఫోన్ పేలో మీకు లోన్ ప్రాసెస్ ఉంటుంది. ఇందులో మీరు లోన్ తీసుకున్నాక 6 నెలల నుంచి 48 నెలల దాకా టెన్యూర్ పెట్టుకోవచ్చు. ఇక వడ్డీ రేటు విషయానికి వస్తే 18 శాతం నుంచి 36 శాతం వరకు పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు 3 శాతం నుంచి 5 శాతం దాకా ఉంటుంది. ఇదీ సంగతి. మరి ఈ లోన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.