iDreamPost
android-app
ios-app

Paytm బంపరాఫర్.. ఫ్రీగా iPhone 15 గెలుచుకునే ఛాన్స్.. ఎలా అంటే?

  • Published Jan 27, 2024 | 3:25 PM Updated Updated Jan 27, 2024 | 3:27 PM

ప్రముఖ డిజిటల్ చెల్లింపు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం యూజర్లకు అద్బుతమైన ఆఫర్ ను ప్రకటించింది. ఏకంగా ఐ ఫోన్ 15 ను ఉచితంగా గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

ప్రముఖ డిజిటల్ చెల్లింపు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం యూజర్లకు అద్బుతమైన ఆఫర్ ను ప్రకటించింది. ఏకంగా ఐ ఫోన్ 15 ను ఉచితంగా గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

  • Published Jan 27, 2024 | 3:25 PMUpdated Jan 27, 2024 | 3:27 PM
Paytm బంపరాఫర్.. ఫ్రీగా iPhone 15 గెలుచుకునే ఛాన్స్.. ఎలా అంటే?

ప్రస్తుతం ఆర్థికపరమైన చెల్లింపులన్నీ ఆన్ లైన్ విధానంలోనే జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం దూసుకెళ్తున్నాయి. నిత్యం అధిక మొత్తంలో ఈ ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ ద్వారానే జరుగుతున్నాయి. కిరాణ షాపుల నుంచి మొదలుకుని పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కస్టమర్లు ఆన్ లైన్ విధానంలోనే పేమెంట్ చేస్తున్నారు. అయితే ఈ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పేమెంట్ యాప్స్ పలు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు బంపరాఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం యూజర్లకు అద్బుతమైన ఆఫర్ ను ప్రకటించింది. ఏకంగా ఐ ఫోన్ 15 ను ఉచితంగా గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. అదెలా అంటే?

ఐఫోన్ లకు ఉండే క్రేజ్ ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. ఐఫోన్లు మార్కెట్లోకి విడుదలవుతున్నాయంటే స్టోర్ ల ముందు క్యూలు కడుతుంటారు ఐఫోన్ లవర్స్. అద్భుతమైన ఫీచర్లతో లభించే ఈ ఫోన్లు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. అయితే ఈ ఫోన్ల ధరలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. కాబట్టి అంత ఖరీదైన ఫోన్లను కొనేందుకు కాస్త వెనకా ముందు ఆలోచిస్తుంటారు. మరి అంత ధర పెట్టి కొనలేని పరిస్థితి ఉన్నవాళ్లు పేటీఎం ద్వారా ఉచితంగానే ఐ ఫోన్ ను దక్కించుకోవచ్చు. పేటీఎం శుక్రవారం రిపబ్లిక్ డే ఫెస్టివల్ థీమ్‌తో ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు రూ. 500 వరకు క్యాష్‌బ్యాక్‌ను, ఐఫోన్ 15ని గెలుచుకునే ఛాన్సు ఉంది. ఈ ఆఫర్ ప్రకారం పేటీఎం విధించిన గడువు జనవరి 31 లోగా పేటీఎం యాప్‌లో కన్పించే 16 టికెట్లను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

Chance to Win iPhone 15 Free

పేటీఎం యూజర్లుకు పేటీఎం యాప్‌లో మొత్తం 16 లాక్డ్ స్టాంప్స్ కన్పిస్తాయి. వీటిని ఆన్ లైన్ పేమెంట్స్ చేయడం ద్వారా, ఫ్రెండ్స్ ను పేటీఎంకు ఇన్వైట్ చేయడం ద్వారా ఓపెన్ చేయొచ్చు. అయితే 16 స్టాంప్స్ లో నాలుగు వాట్సప్ ద్వారా స్నేహితుల్ని ఆహ్వానించి ఆ స్నేహితులు పేటీఎం వినియోగించేలా చేస్తే నాలుగు ఓపెన్ అవుతాయి. మిగిలినవి పేటీఎం ద్వారా సమీప దుకాణాల్లో చెల్లింపులు, రీఛార్జ్ చేయడం, బిల్లుల చెల్లింపులు చేయడం ద్వారా ఓపెన్ అవుతాయి. ఇలా మొత్తం 16 స్టాంప్స్ అన్‌లాక్ చేయగలిగితే 500 రూపాయల వరకూ క్యాష్ బ్యాక్, ఐఫోన్ 15 గెల్చుకునే అవకాశం మీ సొంతం అవుతుంది. మరి ఈ అవకాశం జనవరి 31 వరకు అంటే ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఛాన్స్ ఉంది. మరి మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet