పండగ ముందు సామాన్యులకు భారీ షాక్‌.. పెరగనున్న ఉల్లి ధర.. కారణమిదే

పండుగ పూట సామాన్యులకు భారీ షాక్‌ తగిలింది. ప్రజల చేత కంటతడి పట్టించేందుకు ఉల్లి రెడీ అవుతోంది. ఒక్కసారిగా ఉల్లి ధర భారీగా పెరిగింది. ఎందుకు అంటే..

పండుగ పూట సామాన్యులకు భారీ షాక్‌ తగిలింది. ప్రజల చేత కంటతడి పట్టించేందుకు ఉల్లి రెడీ అవుతోంది. ఒక్కసారిగా ఉల్లి ధర భారీగా పెరిగింది. ఎందుకు అంటే..

ఈ ఏడాది కూరగాయలు సామాన్యులకు భారీ షాక్‌ ఇస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు టమాటా ధర కొండెక్కి కూర్చుంది. కిలో ధర ఏకంగా 200 రూపాయల వరకు పలికింది. సామాన్యుల సంగతి ఏమో కానీ.. పెరిగిన టమాటా ధర కారణంగా ఈ ఏడాది చాలా మంది అన్నదాతలు కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారు. పెరిగిన టమాటా ధరతో జనాలు బెంబెలెత్తిపోయారు. సుమారు 40 రోజుల పాటు కొండెక్కిన టమాటా ధర.. ఆ తర్వాత నెమ్మదిగా దిగి వచ్చింది. దాంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ ఊరట కాసేపే. మరోసారి సామాన్యుల చేత కన్నీళ్లు పెట్టించేందుకు నేను ఉన్నాను అంటుంది ఉల్లిపాయ. పండుగ వేళ.. ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగి సామాన్యులకు భారీ షాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ వివరాలు..

నిన్నటి మొన్నటి వరకు ఉల్లి ధర 20 రూపాయలలోపే ఉంది. కానీ గత రెండు మూడు రోజులుగా ఉల్లి ధర భారీగా పెరిగి సామాన్యులకు షాక్‌ ఇస్తోంది. ప్రస్తుతం ఒపెన్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర ఏకంగా 50 రూపాయలు పలుకుతుంది. ఇక రైతు మార్కెట్లలో అయితే కిలో ఉల్లి ధర 40 రూపాయలుగా ఉంది. పండుగ పూట ద్రవ్యోల్బణం మరోసారి పెరగడంతో.. ఆ ప్రభావం నిత్యవసరాల మీద పడింది. మరీ ముఖ్యంగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి అంటున్నారు మార్కెట్‌ నిపుణులు.

ఈ క్రమంలోనే వారం క్రితం వరకు కిలో రూ.20 నుంచి రూ.35 వరకు విక్రయించిన ఉల్లి ప్రస్తుతం రూ.45 దాటింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే కిలో ఉల్లి ధర రూ.50కి చేరిగింది. అంటే వారం రోజుల వ్యవధిలోనే ఉల్లి ధర కిలో మీద ఏకంగా రూ.20 పెరిగింది. రానున్న రోజుల్లో దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. మొన్నటి వరకు టమాటా ధర చూసి భయపడ్డ జనాలు.. ఇప్పుడు ఉల్లి ధర చూసి బెంబెలుత్తుతున్నారు.

ఉల్లి ధర పెరగడానికి కారణమిదే..

అయితే ఉల్లి ధర ఉన్నట్లుండి ఒక్కసారిగా ఇంత భారీగా పెరగడానికి కారణం ఏంటి అంటే.. వర్షాలు. అవును ఈ ఏడాది వర్షాలు సరిగా పడలేదు.. కురిసినా కూడా ఆలస్యంగా వచ్చాయి. దాంతో ఈసారి ఉల్లి సాగు కూడా దాదాపు 120 రోజులు ఆలస్యమైంది. సాధారణంగా ప్రతి ఏటా.. ఈ పాటికే కొత్త ఉల్లి మార్కెట్‌లోకి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో.. ఉల్లి సాగు కూడా ఆలస్యమైంది. కొత్త ఉల్లి మార్కెట్‌లోకి రావడానికి మరి కాస్త సమయం పడుతంది. అంతేకాక ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదని.. అందుకే ఉల్లి ధర ఇంత భారీగా పెరిగింది అంటున్నారు మార్కెట్‌ నిపుణులు.

అయితే ఒక్కసారి కొత్త ఉల్లి మార్కెట్‌లోకి వస్తే.. ధర దిగి వస్తుందని.. అంచనా వేస్తున్నారు. నవంబర్‌ మొదటి వారానికి ఉల్లి ధర దిగి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అప్పటి వరకు జనాలకు ఇబ్బంది తప్పదని అంటున్నారు. ఇక పండగ సీజన్లో ఉల్లి ధరలు పెరగడం.. సామాన్యులకు షాక్‌ అనే చెప్పవచ్చు. ఈ క్రమంలో ఉల్లి ధరలు భారీగా పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతున్నారు.

ప్రస్తుతం కర్ణాటకలోని రానుల్, బళ్లారి నుండి ఆంధ్రప్రదేశ్ అంతటా ఉల్లి సరఫరా కొనసాగుతుంది. ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా అవసరానికి సరిపడా ఉల్లి సరఫరా జరగడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లికి భారీ కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్ర నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. ప్రసుత్తం ఆంధ్రప్రదేశ్‌కు రోజుకు 600 టన్నుల ఉల్లి వస్తుంది. అయితే నవంబర్‌ మొదటి వారం వరకు ఉల్లి ధరలు దిగి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మార్కెట్‌ నిపుణులు.

Show comments