iDreamPost
android-app
ios-app

Ola ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బంపర్ ఆఫర్.. 15 వేల వరకు తగ్గింపు!

  • Published Jun 22, 2024 | 3:50 PM Updated Updated Jun 22, 2024 | 5:10 PM

మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఓలా ఈవీపై బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా 15 వేల వరకు ప్రయోజనాలు అందుకోవచ్చు.

మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఓలా ఈవీపై బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా 15 వేల వరకు ప్రయోజనాలు అందుకోవచ్చు.

  • Published Jun 22, 2024 | 3:50 PMUpdated Jun 22, 2024 | 5:10 PM
Ola ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బంపర్ ఆఫర్.. 15 వేల వరకు తగ్గింపు!

ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ హవా నడుస్తున్నది. పర్యావరణ హితంగా ఉండడం, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే వీలుండడంతో ఈవీలను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ ధరలు కూడా అధికంగా ఉండడం కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడానికి మరో కారణం. బడ్జెట్ ధరల్లోనే ఈవీలు వస్తుండడంతో వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. ఈవీ రంగంలో ఓలా టాప్ లో దూసుకెళ్తున్నది. ఈ కంపెనీ విడుదల చేసే స్కూటర్లకు మంచి ఆదరణ లభించింది. కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు బంపరాఫర్లను ప్రకటిస్తున్నది. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 స్కూటర్ పై ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 15 వేల వరకు ప్రయోజనాలను పొందొచ్చు.

ఓలా నుంచి ఇప్పటి వరకు స్కూటర్లే రాగా త్వరలో ఎలక్ట్రిక్ బైక్ ను కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. కాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై మార్కెట్ లో మంచి ఆఫర్ ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 స్కూటర్ పై రూ. 15,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. జూన్ 20 నుంచి 26వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. తమ బ్రాండ్ ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ మోడళ్లపై రూ.5000 ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. రూ.5000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, మరియు రూ.5000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉన్నాయి. రూ. 2,999 విలువైన ఉచిత ఓలా కేర్+సబ్ స్క్రిప్షన్ ని అదనంగా ఇస్తోంది.

OLA EV

ఓలా ఎస్1ప్రో ధర రూ. 1,29,999 కాగా.. ఎస్1 ఎయిర్ ధర రూ. 1,04,999.. ఎస్1 ఎక్స్+ ధర రూ. 89,999గాఉంది. ఓలా ఎస్1 శ్రేణి కస్టమర్‌లు రూ. 4,999కి లక్ష కిలోమీటర్ల వరకు, రూ. 12,999కి 1.25 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని పొడిగించుకునే అవకాశం కల్పించింది. ఓలా ఈవీలు సింగిల్ ఛార్జ్ తో 100కి.మీలకు పైగా ప్రయాణించే వీలుండడం, ధరలు కూడా బడ్జెట్ లోనే ఉండడంతో మార్కెట్ లో ఫుల్ డిమాండ్ నెలకొన్నది.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet