Krishna Kowshik
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పెళ్లికి ముందే మరికొన్ని వివాహాలు చేయాలని భావించింది ఈ కుటుంబం. ఈ మేరకు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పెళ్లికి ముందే మరికొన్ని వివాహాలు చేయాలని భావించింది ఈ కుటుంబం. ఈ మేరకు
Krishna Kowshik
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో సందడి నెలకొంది. ముకేశ్, నీతా అంబానీల ముద్దుల కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జులై 12న వివాహం జరగనుంది. ఇప్పటికే వ్యాపార, సినీ, క్రీడా, రాజకీయ దిగ్గజాలకు ఇన్విటేషన్లను అందించారు. ఇక ఇప్పటికే పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి విదితమే. వెడ్డింగ్ కార్డు తమ తాహత్తుకు తగ్గట్టుగానే డిజైన్ చేయించింది అంబానీ ఫ్యామిలీ. రెండు నెలల క్రితం ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ జామ్ నగర్‌లో ధూం ధామ్‌గా నిర్వహించిన సంగతి విదితమే. అలాగే రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా ప్రపంచమంతా చర్చించుకునేలా జరిగాయి. ఇక పెళ్లిని కూడా భారీగానే ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే కొడుకు పెళ్లికి ముందు ఓ మహత్తర కార్యానికి తెరలేపింది దిగ్గజ వ్యాపార కుటుంబం.
అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా.. ఓ గొప్ప కార్యక్రమం తలపెట్టింది ఆ ఫ్యామిలీ. నిరుపేద కుటుంబాల్లో పెళ్లికి సిద్దమైన వారికి సామూహిక వివాహాలు చేయాలని నిర్ణయించింది. జులై 2న మహారాష్ట్రలో ఈ వివాహాలు జరుపుతున్నారు. పాల్గర్‌లో స్వామి వివేకానంద విద్యామందిలో ఈ సామూహిక వివాహాలు జరుపుతున్నారు. ఈ పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు మొత్తం అంబానీ కుటుంబమే భరిస్తుంది. పెళ్లి ఏర్పాట్ల నుండి.. విందు భోజనాల వరకు పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారట అంబానీ, నీతా. అనంత్ పెళ్లి సందర్భంగా ఈ కార్యక్రమానికి చేపడుతుంది ముకేశ్ ఫ్యామిలీ. గతంలో కూడా కూతురు పెళ్లి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది ఈ కుటుంబం. దాతృత్వం చేయడంలో, సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది ముకేశ్ ఫ్యామిలీ.
సింప్లిసిటీకి నిలువెత్తు రూపమైన ముకేశ్.. ఇప్పుడు మరోసారి తమ గొప్పమనస్సును చాటుకున్నారు. కొడుకు పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో..డబ్బులు లేని నిరుపేద కుటుంబాల్లోకి పెళ్లీడు పిల్లలకు సామూహిక వివాహాల పేరిట పెళ్లి జరిపిస్తున్నారు. ఇక అనంత్, రాధిక మర్చంట్ పెళ్లి విషయానికి వస్తే.. ఇప్పటికే ఆ ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సందడి నెలకొంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 12న వివాహం జరగనుంది. అలాగే పోస్టు వెడ్డింగ్ కార్యక్రమాలను కూడా చేపట్టనుంది. జులై 13, 14 తేదీల్లో వివిధ కార్యక్రమాలు ఉండనున్నాయి. భారీ సంఖ్యలో అతిరథ మహారథలు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ పెళ్లికి డ్రెస్ కోడ్ కూడా ఉంది. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో హాజరు కావాలన్నది కండిషన్.
As part of the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant, a mass wedding of the underprivileged has been organised at 4:30 pm on 2nd July, at Swami Vivekanand Vidyamandir in Palghar. pic.twitter.com/tRu1h5Em6g
— ANI (@ANI) June 29, 2024