iDreamPost
android-app
ios-app

అంబానీ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. పెళ్లి తేదీ రివీల్‌

  • Published Oct 02, 2023 | 2:57 PM Updated Updated Oct 02, 2023 | 3:28 PM
  • Published Oct 02, 2023 | 2:57 PMUpdated Oct 02, 2023 | 3:28 PM
అంబానీ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. పెళ్లి తేదీ రివీల్‌

సెలబ్రిటీల వ్యక్తిగత అంశాలపై అభిమానులకే కాదు.. సామాన్యులకు కూడా బోలేడంత ఆసక్తి ఉంటుంది. ఇక వారి ఇళ్లల్లో జరిగే వేడుకలు.. ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సెలబ్రిటీల ఇండ్లలో జరిగే వేడుకలు ఒక ఎత్తైతే.. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట జరిగే వేడుకలు మరో ఎత్తు. సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాక.. విదేశాల నుంచి కూడా సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరవుతారు. ఇక గతంలో అంబానీ తన కుమార్త ఈషా వివాహం ఎంత ఘనంగా జరిపించాడో అందరికి తెలుసు. ఆ తర్వాత పెద్ద కుమారుడి పెళ్లి వేడుక కూడా అంతే వైభవంగా జరిపించాడు. ఇక త్వరలోనే మరోసారి అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆ వివరాలు..

త్వరలోనే ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇంతకు పెళ్లి ఎవరిది అంటే అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీది. ఇప్పటికే రాధికా మర్చంట్‌తో నిశ్చితార్థం చేసుకున్న అనంత్‌ అంబానీ.. త్వరలోనే మూడు ముళ్ల బంధంతో వివాహ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం. వీరి వివాహ తేదీని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంబానీ ఫ్యాన్ పేజీ అందించిన సమాచారం ప్రకారం వచ్చే ఏడాది (2024) జూలై 10, 11, 12 తేదీల్లో అంగరంగ వైభవంగా అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది. అయితే అనంత్‌ అంబానీ పెళ్లి గురించి ఇప్పటి వరకు అంబానీ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

wedding in ambani house 1

కాగా అనంత్‌ అంబానీ.. ఈ ఏడాది జనవరిలో.. తన ప్రియురాలు రాధికా మర్చంట్‌ని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ లవ్‌బర్డ్స్‌ కుటుంబ వేడుకల్లో, పలు పబ్లిక్ ఈవెంట్‌లలో జంటగా హాజరవుతూ.. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులతో నిర్వహించిన గణేష్‌ చతుర్థి వేడుకల్లో కాబోయే భర్త అనంత్ అంబానీ కుటుంబంతో పాటు రాధికా మర్చంట్ సందడి చేసిన ఫోటోలు తెగ వైరల్‌ అయ్యాయి. వినాయక చవితి సందర్భంగా రాధికా మర్చంట్‌.. కాబోయే అత్తగారు నీతా అంబానీ, తోటికోడలు శ్లోకా మెహతాతో కలిసి పూజలు నిర్వహించింది.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş