ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నారా?.. బ్యాంకుల కొత్త రూల్స్ తో ఖాతాదారులకు భారీ లాభం

Bank Rules: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. బ్యాంకులు కొత్త రూల్స్ తీసుకొస్తున్నాయి. ఈ కొత్త రూల్స్ తో ఖాతాదారులకు భారీ లాభం చేకూరనున్నది. ఫిక్స్ డ్ డిపాజిట్ చేసేవారికి ఎక్కువ ప్రయోజనం చూకూరనున్నది.

Bank Rules: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. బ్యాంకులు కొత్త రూల్స్ తీసుకొస్తున్నాయి. ఈ కొత్త రూల్స్ తో ఖాతాదారులకు భారీ లాభం చేకూరనున్నది. ఫిక్స్ డ్ డిపాజిట్ చేసేవారికి ఎక్కువ ప్రయోజనం చూకూరనున్నది.

కొత్త నెల ప్రారంభమవుతుందంటే చాలు అనేక మార్పులు చోటుచేసుకుంటుంటాయి. బ్యాంకుల రూల్స్, క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకులు కొత్త రూల్స్ తీసుకొస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులు ఈ రూల్స్ ను ప్రవేశపెడుతున్నాయి. ఈ రోజుల్లో కుటుంబ భద్రత కోసం బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసే వారి సంఖ్య పెరుగుతున్నది. మరి మీరు కూడా ఎఫ్డీలు చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంకుల కొత్త రూల్స్ తో భారీ లాభం చేకూరనున్నది.

బ్యాంకుల కొత్త రూల్స్ తో ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై వడ్డీ రేటు భారీగా అందనుంది. ఆర్బీఐ బల్క్ డిపాజిట్లకు సంబంధించి మార్పులను సూచించింది. బ్యాంకుల్లో రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లను రిటైల్ డిపాజిట్లుగా పరిగణించాలని స్పష్టం చేసింది. అంతకుముందు ఇది రూ. 2 కోట్ల నుంచి ఆపైన ఉండే వాటినే బల్క్ డిపాజిట్లుగా పరిగణించారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం రూ. 3 కోట్ల వరకు రిటైల్ డిపాజిట్లుగానే పేర్కొంటూ కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నాయి బ్యాంకులు. సాధారణంగా బ్యాంకుల్లో బల్క్ డిపాజిట్ల కంటే రిటైల్ డిపాజిట్లపైనే ఎక్కువ వడ్డీ వస్తుంది. 3 కోట్ల వరకు ఎఫ్డీలు చేసే వారికి అధిక వడ్డీ అందనున్నది.

ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రిటైల్ టర్మ్ డిపాజిట్‌ను రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు పరిమితి పెంచింది. ఇది మే 15 నుంచే అమల్లోకి వచ్చింది. అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించింది. ఇది జూన్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే సమయంలో రిటైల్ టర్మ్ డిపాజిట్ నగదును రూ. 2 కోట్ల నుంచి 3 కోట్లకు చేర్చుతున్నట్లు అధికారిక వెబ్‌‌సైట్లో వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు వరుసగా జూన్ 12, జూన్ 10 వడ్డీ రేట్లను సవరించి ఇదే సమయంలో రిటైల్ డిపాజిట్ మొత్తాన్ని రూ. 3 కోట్లకు పెంచేశాయి.

Show comments