P Krishna
RBI New Rules: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల మార్కెట్ లో 10 నాణేలు చలామణిలో లేవని రూమర్ వచ్చింది. అంగే చాలా మంది వ్యాపారస్తులు 10 కాయిన్ తీసుకోవడానికి విముఖత చూపుతున్నారు.
RBI New Rules: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల మార్కెట్ లో 10 నాణేలు చలామణిలో లేవని రూమర్ వచ్చింది. అంగే చాలా మంది వ్యాపారస్తులు 10 కాయిన్ తీసుకోవడానికి విముఖత చూపుతున్నారు.
P Krishna
ఇటీవల భారత దేశంలో చిరు వ్యాపారులు పది రూపాయల నాణేలను తీసుకోవడానికి జంకుతున్నారు. ఎందుకంటే మార్కెట్ లో 10 నాణేలు చలామణిలో లేవని పుకార్లు పుట్టుకు వచ్చాయి. దీంతో చాలా మంది వ్యాపారస్తులు 10 రూపాయ నాణేలను తీసుకోవడం లేదు. అలాగే వినియోగదారులు కూడా ఎవరైన పది కాయిన్ ఇస్తే తీసుకోవాడానికి జంకుతున్నారు. వాస్తవానికి పది రూపాయణ కాయిన్ పై వస్తున్న రూమర్లు నమ్మవొద్దని బ్యాంకులు చెబుతున్నాయి.కానీ జనాల్లో నాటుకుపోయిన అవిశ్వాసాన్ని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశ కరెన్సీకి 10 నాణెం చలామణిపై కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
భారత దేశంలో పెరిగిపోతున్న నల్లధనం, నకిలీ కరెన్సీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. కొత్తగా రూ.500, రూ.2000 వేల నోట్లను చలామణిలోకి తీసుకువచ్చింది. నల్లధనం చెలామణిలో రెండు వేల రూపాల నోటుల దుర్వినియోగం అవుతుందని భావించి 2023లో ఆ నోటును రద్దు చేశారు. ప్రస్తుతం దేశంలో రూ.1,2,5,10,20 నాణేలు అమల్లో ఉన్నాయి.ఇటీవల నాణేల చలామణిపై కొన్ని రూమర్లు పుట్టుకు వచ్చాయి. ముఖ్యంగా రూ.10, 20 నాణేల వాడకం పై వినియోగదారులకు గందరగోళంలో పడ్డారు.వ్యాపారులు ఈ నాణేలను తీసుకోకపోవడంతో వాటి వాడకంపై ప్రజలకు కూడా వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది దుకాణ యజమానులు పెద్ద మొత్తంలో ఈ నాణేలను నిల్వ ఉంచారు.. అలాగే వినియోదారుల పరిస్థితి కూడా అలేగా ఉది. ఇదిలా ఉంటే.. రూ.10, రూ.20 నాణేలు చట్టబద్దమైనవి, అన్ని లావాదేవీల్లో ఇవి ఆమోదించబడతాయని ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. వీటి చలామణిలో అభ్యంతరం చెప్పినా.. తీసుకోమని వ్యతిరేకించినా వారికి భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్ 124ఎ ప్రకారం, భారత ప్రభుత్వం ఆమోదించిన ఆయా నాణేలను స్వీకరించడానికి నిరాకరించే వ్యాపారులకు మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపింది.
ఆర్‌బీఐ తీసుకు వచ్చిన కొత్త రూల్స్ :
వ్యాపారస్తులు, వినియోగారులు లావాదేవీల్లో రూ.10, రూ.20 నాణేలను అంగీకరించారలి
ఈ నాణేలను స్వీకరించడానికి నిరాకరిస్తే చట్టపరమైన చర్యలకు దారి తీస్తుంది.
రూ.10, రూ.20 నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
రూ.10, రూ.20 నాణేలను చెలామణి గురించి ఆర్‌బీఐ ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ కృషి చేస్తుంది.
ప్రజలు, వ్యాపారుల్లో రూ.10, రూ.20 నాణేలను చలామణిపై అవగాహన కల్పించేందుకు సమాచార ప్రచారాలు నిర్వహించబడతాయి.