iDreamPost
android-app
ios-app

మీకు డేటా ఎక్కువ కావాలా? ఈ BSNL ప్లాన్ మీకోసమే.. ఏడాదంతా డైలీ 3జీబీ డేటా

BSNL Recharge plan: మీరు ఎక్కువ డేటా అందించే ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ బీఎస్ఎన్ ఎల్ ప్లాన్ మీకోసమే. ఒక్కసారి రీచార్జ్ చేస్తే ఏడాదంతా డైలీ 3జీబీ డేటా అందుకోవచ్చు.

BSNL Recharge plan: మీరు ఎక్కువ డేటా అందించే ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ బీఎస్ఎన్ ఎల్ ప్లాన్ మీకోసమే. ఒక్కసారి రీచార్జ్ చేస్తే ఏడాదంతా డైలీ 3జీబీ డేటా అందుకోవచ్చు.

మీకు డేటా ఎక్కువ కావాలా? ఈ BSNL ప్లాన్ మీకోసమే.. ఏడాదంతా డైలీ 3జీబీ డేటా

గత నెలలో ప్రముఖ టెలికాం సంస్థలు రీచార్జ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో మొబైల్ యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరతో రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉండే బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు మారేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వేలాది మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ కు మారారు. ఇక కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్లను తీసుకొస్తున్నది. తక్కువ ధరలోనే ఎక్కువ బెనిఫిట్స్ ను అందిస్తున్నది. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థలకు గట్టిపోటీనిస్తున్నది. డేటా ఎక్కువగా వాడే యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్ ను తీసుకొచ్చింది.

మీరు డేటాను ఎక్కువగా వాడుతారా? అయితే తక్కువ ధరలో ఎక్కువ డేటాను అందించే ప్లాన్ల కోసం చూస్తున్నారా? అయితే 365 డేస్ వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ధర రూ. 2999గా ఉంది. ఈ రీచార్జ్ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే సంవత్సరం పొడవునా అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతి రోజు 3 జీబీ హైస్పీడ్ డేటా పొందొచ్చు. ఈ వార్షిక ప్లాన్ లో యూజర్లు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పొందొచ్చు. సినిమాలు, గేమింగ్ కోసం ఎక్కువ డేటాను యూజ్ చేసే వారికి ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఇతర టెలికాం సంస్థల్లో ఈ ధరలో ఇన్ని బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ లేవు.

BSNL

బీఎస్ఎన్ఎల్ అందించే 199 ప్లాన్ తో కళ్లు చెదిరే బెనిఫిట్స్ అందుకోవచ్చు. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ప్రతి రోజు 2జీబీ డేటాను అందుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పొందొచ్చు. డేటా ఎక్కువగా అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. తక్కువ ధరలో ఎక్కువ డేటా, బెనిఫిట్స్ కావాలనుకునే వారు ఈ ప్లాన్లపై ఓ లుక్కేయండి.