Keerthi
Business Idea: చాలామంది వ్యాపారంలో పెద్ద మొత్తంలోని డబ్బులు సంపాదించేయాలని కలలు కంటారు. మరి, అలా బిజినెస్ లో లాభాలు సంపాదించాలనుకునే వారందరికీ మన వంట ఇంటి వస్తువు ఒకటి అందుబాటులో ఉంది. ఇంతకి అదేమిటంటే..
Business Idea: చాలామంది వ్యాపారంలో పెద్ద మొత్తంలోని డబ్బులు సంపాదించేయాలని కలలు కంటారు. మరి, అలా బిజినెస్ లో లాభాలు సంపాదించాలనుకునే వారందరికీ మన వంట ఇంటి వస్తువు ఒకటి అందుబాటులో ఉంది. ఇంతకి అదేమిటంటే..
Keerthi
మనలో చాలామందికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించేయాలని చాలా కలలు కంటూ ఉంటాం. అయితే, అది అందరికీ సాధ్యం కాదు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఎక్కువ డబ్బులను సంపాదించాలే ఆశతో విశ్వప్రయాత్నలు చేస్తుంటారు. రకరకాల వ్యాపారాలను ప్రారంభిస్తుంటారు. కానీ ఈ వ్యాపార రంగంలో కొనసాగి ఎదగడం అంటే చిన్న మాట కాదు, ఇది అందరికీ సాధ్యపడేది కాదు. ఎంతోమంది ఇలా వ్యాపార రంగంలోకి దిగి నష్టాలకు గురయ్యిన వాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే.. ఈ వ్యాపారానికి తగిన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మార్కెటింగ్ స్ట్రాటజీలు తోడైతేనే లాభాలను అందిస్తుంది. పైగా మార్కెట్లో అలాంటి డిమాండ్ ఉన్న వస్తువు అయితే వ్యాపార వృద్ధి అనేది త్వరగా సాధ్యమవుతుంది. మరి, అలాంటి గొప్ప బిజినెస్ ఐడియాలో.. మనం వంట ఇంటి వస్తువు కూడా ఒకటి ఉంది. దీంతో అనేక లాభాలను ఆర్జించవచ్చు. ఇంతకి అదేమిటంటే..
ప్రతిఒక్కరు తాము కోటీశ్వరులు అవ్వలని చాలా ఆశ పడుతుంటారు. ఈ క్రమంలోనే చాలామంది రకరకాల వ్యాపారలు ప్రారంభించి నష్టపోతుంటారు. కానీ, ఏ వ్యాపారమైనా మొదట చిన్నగానే ప్రారంభించాలి, అదే ఎంతో ఉపాయోగకరం. మరి అలా నష్టపడకుండా.. మంచి ఆద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టే దానిలో మన వంటి ఇంటి వస్తువు కూడా ఒకటి ఉంది. అదే వంట ‘నూనె’. తరుచు ఎంతోమంది తమ దైనందిన జీవితంలో ఈ నూనెను రకరకాల వంటల్లో వినియోగిస్తుంటారు. ఈ క్రమంలోనే పామ్ ఆయిల్, మస్టర్డ్ సోయాబీన్, సన్ ఫ్లవర్, కాటన్, పీనట్ వంటి అనేక రకాల నూనెలు కూడా మార్కెట్ ల అందుబాటులో ఉన్నాయి. అలాగే వీటన్నిటికి మార్కెట్ లో మంచి డిమాండ్ పెరుగుతూనే ఉంది ఇప్పటికే వివిధ రకాల విత్తనాల నుంచి ఈ వంట నూనె వెలికితీత పరిశ్రమకు గిరాకీ బాగా పెరుగుతోంది.
ఇక భారతదేశంలో సహజ వాతవరణంలో ఎక్కువగా.. ఆవాలు, సోయాబీన్, పత్తి, వేరుశెనగ వంటి ఇతర రకాల నూనె పంటలను పండిస్తున్నారు. ఈ నూనెలు చాలా ఉత్పత్తి లాభదాయకమైనవి. అలాగే ఈ నూనెను బయటకు తీసే గానుగ(ఆయిల్ మిల్లు)లు లాభదాయక వ్యాపార వెంచర్లలో ఒకటిగా నిలుస్తున్నాయి. కాగా, వీటికి కావాల్సిన మొత్తం పెట్టబడి దాదాపు రూ.2 లక్షలు ఉంటే చాలు. అయితే దీనిని పెద్ద ఎత్తన వ్యాపారంగా ప్రారంభించాలంటే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు అవసరం అవుతుంది.
అయితే అనేక నివేదికల ప్రకారం.. ఈ అయిల్ మిల్ లోని 25 శాతం నుంచి 35 శాతం వరకు లాభాలను సంపాదించవచ్చు. కాగా, ఈ వెంచర్ విక్రయాలపై ఆధారపడిన వారు నెలకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు సంపాదించవచ్చు తెలుస్తోంది. మరి, ఈ వంట అయిల్ తో చేసే బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.