iDreamPost
android-app
ios-app

లగ్జరీ ఇంటిని అమ్మేసిన ముకేశ్ అంబానీ! ఎన్ని కోట్లంటే?

  • Author Soma Sekhar Published - 06:12 PM, Wed - 9 August 23
  • Author Soma Sekhar Published - 06:12 PM, Wed - 9 August 23
లగ్జరీ ఇంటిని అమ్మేసిన ముకేశ్ అంబానీ! ఎన్ని కోట్లంటే?

ముకేశ్ అంబానీ.. భారత దిగ్గజ పారిశ్రామిక వేత్తగా, ఆసియా లోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. వరల్డ్ వైడ్ గా తన సామ్రాజ్యాన్ని విస్తరించి బిజినెస్ కింగ్ గా కొనసాగుతున్నాడు. అయితే ప్రస్తుతం ముకేశ్ అంబానీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది. ముకేశ్ అంబానీ తనకు చెందిన ఓ లగ్జరీ ఇంటిని అమ్మేశాడని తెలుస్తోంది. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ముకేశ్ అంబానీకి ఇల్లులు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒక ఖరీదైన ఇంటిని అమ్మేశాడంట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆసియా కుబేరుడు, భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తన లగ్జరీ ఇల్లును అమ్మేశాడంట. న్యూయార్క లోని మాన్ హట్టన్ లో అంబానీకి ఓ లగ్జరీ హోమ్ ఉంది. మాన్ హట్టన్ వెస్ట్ విలేజ్ లో ఓ అపార్ట్ మెంట్ లోని 4వ ఫ్లోర్ లో 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఖరీదైన ఇల్లు ఉంది. ఈ ఇంటిని తాజాగా ముకేశ్ అంబానీ విక్రయించినట్లుగా ప్రముఖ మీడియా న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఈ ఇంటిని అంబానీ ఏకంగా 9 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లుగా పేర్కొంది. ఇండియన్ కరెన్సీ లో దాదాపుగా రూ. 74.5 కోట్లన్న మాట. హడ్సన్ నదీ తీరాన ఉన్న ఈ లగ్జరీ ఇంటిలో రెండు బెడ్ రూమ్ ఉన్నాయి.

ఇక నది చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసే విధంగా ఈ ఇంటిని నిర్మించారు. అత్యాధునిక ఇంటీరియర్ డిజైన్ తో అద్భుతంగా ఈ ఇంటి నిర్మాణం చేశారు. మరి ఆసియా కుబేరుడిగా పేరుగాంచిన ముకేశ్ అంబానీ ఇల్లు అమ్ముకోవడం ఏంటి? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అయితే వ్యాపార వేత్తలకు ఇళ్లు అమ్ముకోవడం, ఆస్తులు అమ్ముకోవడం.. కొనడం అలావాటే అన్న విషయం మనందరికి తెలియనిది కాదు. మరి ముకేశ్ అంబానీ ఇల్లు అమ్ముకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: షాకింగ్: మహిళ కడుపులో 15 కిలోల కణతి.. తొలగించిన వైద్యులు!

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom