iDreamPost
android-app
ios-app

కొడుకు పెళ్లి తరువాత కనికరం కోల్పోయిన ముఖేష్ అంబానీ! ఏమైందంటే?

Mukesh Ambani: జూలై నెలలో ముఖేశ్ అంబానీ తన కుమారుడు అనంత అంబానీ, రాధికా మర్చంట్ లో వివాహం జరిపించిన సంగతి తెలిసింది. జూలై 12వ తేదీన వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక కొడుకు పెళ్లి తరువాత ముఖేశ్ అంబానీ కనికరం కోల్పోయినట్లు తెలుస్తోంది.

Mukesh Ambani: జూలై నెలలో ముఖేశ్ అంబానీ తన కుమారుడు అనంత అంబానీ, రాధికా మర్చంట్ లో వివాహం జరిపించిన సంగతి తెలిసింది. జూలై 12వ తేదీన వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక కొడుకు పెళ్లి తరువాత ముఖేశ్ అంబానీ కనికరం కోల్పోయినట్లు తెలుస్తోంది.

కొడుకు పెళ్లి తరువాత కనికరం కోల్పోయిన ముఖేష్ అంబానీ! ఏమైందంటే?

ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఒకరు. వ్యాపార రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలతో ప్రత్యేకంగా నిలిచారు. అలానే ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిన అంగరంగవైభవంగా నిర్వహించి..ప్రపంచం అంత తమ ఇంటివైపు చూసేలా  చేశారు. కోట్లు ఖర్చు పెట్టి ఎంతో ఘనంగా కొడుకు వివాహాన్ని జరిపించాడు. ఇక కుమారుడి పెళ్లిలో ఎంతో ఉదారంగా ఉన్న అంబానీ రిలయన్స్ సంస్థలో పని చేసే ఉద్యోగుల విషయంలో మాత్రం భిన్నంగా ఉన్నట్లు కొన్ని డేటాలు చెబుతున్నాయి. ఉద్యోగులపై కనీకరం కోల్పోయి.. జాబ్స్ లో కోత పెడుతున్నట్లు డేటా చెబుతోంది. ఇక పూర్తి వివరాల్లోక వెళ్తే…

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కనిపిస్తుంది. ఇది వ్యాపారాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదే సమయంలో పెరిగిన ద్రవ్యోల్బణం భయాలతో కంపెనీలు కాస్ట్ కటింగ్ వైపు నడుస్తున్నాయి. ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలోని వ్యాపార వేత్తల్లోనూ పెరిగిన మాంద్యం భయం ఉంది. ఈ క్రమంలోనే దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్  కూడా గడచిన ఏడాది కాలం నుంచి భారీగా ఖర్చులను తగ్గించుకుంటు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కంపెనీ మెుత్తం ఉద్యోగుల సంఖ్య 3,89,000 నుంచి 3,47,000కి తగ్గించినట్లు సమాచారం. తాజాగా ఓ డేటా నివేదిక ప్రకారం.. ఖర్చుల మదింపులో భాగంగా రిలయన్స్  రిటైల్  వర్టికల్ విభాగంలో గరిష్టంగా ఉద్యోగుల సంఖ్య తగ్గించగబడినట్లు తెలిసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను దాదాపు 11శాతం లేదా 42 వేలకు తగ్గించినట్లు డేటా చెబుతోంది. ఇక రిలయన్స్ తాజా వార్షిక నివేదిక ప్రకారం కొత్త నియామకాలు మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా తగ్గింది. అలా లక్ష 70 వేలకు చేరుకుంది. తమ రిటైల్ వ్యాపారం నుంచి  ఎక్కువగా ఉద్యోగులను తగ్గించినట్లు డేటా పేర్కొంది. ఇదే సమయంలో రిలయన్స్ టెలికాం సంస్థ కూడా జియో కూడా 2024 ఆర్థిక సంవత్సరంలో 90వేల మంది ఎంప్లాయిస్ ను తగ్గించుకుంది.  రిలయన్స్ లో ఉద్యోగులకు అందించే సౌకర్యాలపై  చేసే ఖర్చు 3 శాతం పెరిగి రూ.25,699 కోట్లకు చేరుకుంది.

మొత్తంగా రిలయన్స్ ఇండస్ట్రీలో భారీగా ఉద్యోగుల సంఖ్య తగ్గినట్లు నివేదికలు తెలిపాయి. అయితే కుమారుడు పెళ్లి ఘనంగా చేసిన అంబానీ ఉద్యోగల విషయంలో మాత్రం కనికరం చూపించడం లేదని.. ఈ డేటా చూసిన వాళ్ల అభిప్రాయ పడుతున్నారు.గత నెలలో ముఖేశ్ అంబానీ తన కుమారుడు అనంత అంబానీ, రాధికా మర్చంట్ లో వివాహం జరిపించిన సంగతి తెలిసింది. జూలై 12వ తేదీన వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడకకుల ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.  అంతేకాక ముఖేశ్ అంబానీ ఇంట జరిగిన పెళ్లిలో ప్రతి  కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది.