ఆస్పత్రిలో మెటా CEO మార్క్ జుకర్ బర్గ్.. ఏమైందంటే?

జుకర్ బర్గ్ కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింటా వైరల్ గా మారింది. ఆ పిక్ లో తను ఆసుపత్రి బెడ్ పై ఉండి చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆయనకు ఏమైంది?

జుకర్ బర్గ్ కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింటా వైరల్ గా మారింది. ఆ పిక్ లో తను ఆసుపత్రి బెడ్ పై ఉండి చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆయనకు ఏమైంది?

ఫేస్ బుక్ సృష్టికర్త మార్క్ జుకర్ బర్గ్ ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్ బుక్ మాతృసంస్థ పేరును ఇటీవల మెటాగా మార్చిన విషయం తెలిసిందే. కోట్లాది మంది ఖాతాదారులని కలిగి వరల్డ్ వైడ్ గా ప్రాముఖ్యతను సంతరించుకుంది మెటా. ఇదిలా ఉంటే జుకర్ బర్గ్ కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింటా వైరల్ గా మారింది. ఆ పిక్ లో తను ఆసుపత్రి బెడ్ పై ఉండి చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆయనకు ఏమైంది? ఏమైనా ప్రమాదం జరిగిందా? అని నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ఇంతకీ జుకర్ బర్గ్ కు ఏమైందంటే?

మెటా సీఈవో ఆసుపత్రిపాలయ్యాడు. వైద్యుల సమక్షంలో ఆయన చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని తన వ్యక్తిగత ఖాతా ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే ఆయనకు ఈ పరిస్థితి రావడానికి కారణం మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీల కోసం శిక్షణ తీసుకుంటుండగా గాయపడినట్లు గా తెలుస్తోంది. ప్రమాద భారిన పడిన వెంటనే ఆసుత్రికి వెల్లగా ప్రాక్టీస్ లో జుకర్ బర్గ్ మోకాలికి తీవ్ర గాయమైనట్లుగా వైద్యులు వెల్లడించారు. వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు యాంటీరియర్ క్రూసియెట్ లిగమెంట్ ను తొలగించినట్లు మెటా సీఈవో తెలిపారు.

అయితే ఈ విషయంపై జుకర్ బర్గ్ తన ఇన్ స్టాగ్రామ్ లో తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిత్రాలను పోస్టు చేశారు. వైద్యులు, వైద్యబృందం జాగ్రత్తగా చూసుకున్నందుకు జుకర్ బర్త్ కృతజ్ఞతలు తెలిపాడు. నేను వచ్చే ఏడాది ప్రారంభంలో ఎంఎంఎ (మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్) పోటీలకోసం శిక్షణ పొందుతున్నాను. ఈ క్రమంలో నా మోకాలికి గాయమైంది. దీంతో శిక్షణ మరింత ఆలస్యమవుతోంది. నేను కోలుకున్న తర్వాత పోటీలో పాల్గొనేందుకు మళ్లీ శిక్షణ ప్రారంభిస్తానని మెటా సీఈవో వెల్లడించారు. తనకు మద్దతుగా నిలిచి, ప్రేమ పంచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Show comments