నీతా అంబానీకి చీర కట్టి లక్షలు గడిస్తున్న డాలీ.. ఈమె ఎవరంటే..?

మహిళల అందాన్ని ఇనుమడింపజేసేవి చీరలే. అందుకే స్పెషల్ ఫంక్షన్ ఏదైనా ఉంటే.. చీరలే ప్రిఫర్ చేస్తారు. కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా నీతా అంబానీకి తన చీర కట్టుతో మెస్మరైజ్ చేసింది. ఆమెను ఇంత అందంగా రెడీ చేసిన నారీమణి ఎవరంటే..?

మహిళల అందాన్ని ఇనుమడింపజేసేవి చీరలే. అందుకే స్పెషల్ ఫంక్షన్ ఏదైనా ఉంటే.. చీరలే ప్రిఫర్ చేస్తారు. కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా నీతా అంబానీకి తన చీర కట్టుతో మెస్మరైజ్ చేసింది. ఆమెను ఇంత అందంగా రెడీ చేసిన నారీమణి ఎవరంటే..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన చర్చించుకుంటున్న వేడుక.. ప్రముఖ వ్యాపార వేత్త.. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ-నీతాల ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా, మునుపెన్నడూ లేని విధంగా.. ఏ సెలబ్రిటీలకు సాధ్యం కాని రీతిగా ఈ కార్యక్రమం జరిగింది. బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, ట్రంప్ కుమార్తె ఇవాంక వంటి విదేశీ అతిధులే కాకుండా భారత సినీ, క్రీడా అతిరథ మహారధులెందరో ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ మొత్తం వేడుకలో రాధికా మర్చంట్ స్పెషల్ ఎట్రాక్షన్ అయితే.. ఆమెను మించిపోయింది అత్తగారు నీతా అంబానీ. ముఖేష్ అంబానీ భార్యగా, వ్యాపార వేత్తగా, ఇంటి ఇల్లాలిగా ఎనలేని బాధ్యతలు చేపడుతూనే పార్టీలో..అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది.

నీతా అంబానీ ఏ చీర కట్టినా.. హుందాగా కనిపించింది. ఇక ఆమె చేసిన డ్యాన్స్ అయితే.. అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె ధరించిన నెక్లస్ గురించి పెద్ద చర్చే జరిగిందనుకోండి. ఎన్ని నగలు ధరించినా.. ఆమెకు అందాన్ని తెచ్చిపెట్టింది మాత్రం ఆ చీర కట్టే. ఇంట్లో కుమారుడి పెళ్లి వేడుకలు జరుగుతుంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఆ చీర కట్టు క్రెడిట్ అంతా.. ఓ మహిళకు దక్కుతుంది. ఇంతకు ఆ లేడీ ఎవరంటే.. డాలీ జైన్. సెలబ్రిటీల వేడుక ఏదైనా.. ఫస్ట్ చాయిస్‌గా నిలుస్తుంది డాలీ జైన్. సోనమ్ కపూర్, దీపికా, ఆలియా భట్, కత్రినా, నయన తార ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు మెహందీ, పెళ్లి, రిసెప్షన్ వేడులకు చీర అందంగా సింగారింపజేసింది ఈ డిజైనరే. డ్రాపింగ్ డిజైనర్ అయిన ఆమె.. లక్షల్లో ఛార్జ్ చేస్తూ ఉంటుంది.

శారీ డ్రాపింగ్ ఆర్టిస్ట్ అయిన డాలీ.. 325 రకాల్లో చీరలను కట్టగలదు. ఆమెకు ఇదే కేటగిరిలో లిమ్కా బుక్‌లో చోటు దక్కించుకుంది. ఆమె ప్రతిభ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. దేశ విదేశాల్లోనూ ఆమె ఇదే వర్క్ చేస్తూ లక్షలు గడిస్తుంది. ఒక్కో శారీ కట్టుకు.. రూ. 35 వేల నుండి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తుందని టాక్ నడుస్తుంది. సాదా చీరను కూడా అద్భుతమైన కళాఖండంగా మార్చడంలో ఆమె ప్రతిభ కనబరుస్తుంది. అదే గతంలో నీతా అంబానీకి శారీ డ్రాపింగ్ చేసే అవకాశం దక్కించుకుంది డాలీ. నీతా, ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ ప్రారంభోత్సవంలో కూడా నీతాకు చీర కట్టింది డాలీ జైన్. ఇప్పుడు వేడుకల్లో కూడా అత్తా కోడళ్లు.. నీతా, రాధికలకు చీర కట్టి.. వాళ్లిద్దర్నీ ఔరా అనిపించేలా చేసింది. అలాగే ఆమె కూడా బాగానే కూడగట్టుకుందని తెలుస్తోంది.

Show comments