iDreamPost
android-app
ios-app

74 వేల వరకు డిస్కౌంట్స్.. క్రేజీ ఆఫర్లు ప్రకటించిన మారుతీ సుజుకీ!

  • Published Jun 08, 2024 | 9:43 PM Updated Updated Jun 08, 2024 | 9:43 PM

Maruti Suzuki Announces Huge Discounts: మారుతీ సుజుకీ కంపెనీ తమ వినియోగదారులకు క్రేజీ న్యూస్ తీసుకొచ్చింది. కార్లపై ఏకంగా రూ.74 వేల వరకు డిస్కౌంట్స్ తీసుకొచ్చి అందరికీ షాకిచ్చింది. ఏఏ మోడల్స్ పై ఎంత డిస్కౌంట్స్ ఇస్తోదో చూడండి.

Maruti Suzuki Announces Huge Discounts: మారుతీ సుజుకీ కంపెనీ తమ వినియోగదారులకు క్రేజీ న్యూస్ తీసుకొచ్చింది. కార్లపై ఏకంగా రూ.74 వేల వరకు డిస్కౌంట్స్ తీసుకొచ్చి అందరికీ షాకిచ్చింది. ఏఏ మోడల్స్ పై ఎంత డిస్కౌంట్స్ ఇస్తోదో చూడండి.

  • Published Jun 08, 2024 | 9:43 PMUpdated Jun 08, 2024 | 9:43 PM
74 వేల వరకు డిస్కౌంట్స్.. క్రేజీ ఆఫర్లు ప్రకటించిన మారుతీ సుజుకీ!

బడ్జెట్ కారు అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క కంపెనీ మారుతీ సుజుకీ. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్లో మీకు రోడ్ల మీద ఈ కార్లే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఇప్పుడు నెక్సా పేరిట ప్రీమియం కార్లను కూడా బాగానే తీసుకొస్తున్నారు. అద్భుతమైన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. సేఫ్టీ పరంగా కూడా మారుతీ సుజుకీ కార్ల స్టాండర్డ్స్ బాగానే పెరిగిపోయాయి. అందుకే మారుతీ కార్ల కొనుగోలు కూడా మరింత పెరిగింది. అయితే ఇప్పుడు ఆ కంపెనీ తమ వినియోగదారులకు క్రేజీ వార్తను అందిస్తోంది. అంటే మీరు మారుతీ కారును కొనుగోలు చేయాలి అంటే ఇదే మంచి సమయంగా చెప్పచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు అదిరిపోయే డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.

ప్రస్తుతం మారుతీ సుజుకీకి చెందిన కార్లపై క్రేజీ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. అయితే ఈ ఆఫర్స్ అన్నీ మోడల్స్ పై కాకుండా.. కొన్ని సెలక్టివ్ మోడల్స్ పై కంపెనీ ఈ ఆఫర్స్ అందిస్తోంది. అది కూడా జూన్ నెలాఖరు వరకు ఈ డిస్కౌంట్స్ నడుస్తాయని క్లారిటీ ఇచ్చారు. గ్రాండ్ వితారా, ఫ్రాంక్స్, ఎక్స్ఎల్ 6 వంటి నెక్సా మోడల్స్ పై కూడా ఈ డిస్కౌంట్స్ ఉన్నాయి. గ్రాండ్ వితారా, ప్రాంక్స్ మోడల్స్ పై ఏకంగా రూ.74 వరకు డిస్కౌంట్స్, బెనిఫిట్స్ లభిస్తున్నాయి. డిస్కౌంట్స్, ఎక్స్ ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ అంటూ మొత్తానికి ఈ ప్రీమియం మోడల్స్ పై రూ.74 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. అలాగే ఎక్సెల్6 మోడల్ పై ఏకంగా రూ.30 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

ఇంక జిమ్మీ కారులోని అన్ని వేరియంట్లపై రూ.50 వేల వరకు మీరు రాయితీని పొందవచ్చు. ఇందులో కార్పొరేట్ బోనస్, ఎక్స్ ఛేంద్ డిస్కౌంట్ అని కాకుండా.. నేరుగా రూ.50 వేలు తగ్గింపు పొందవచ్చు. ఇంక సియాజ్ పై రూ.48 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. బలేనో మోడల్ పై రూ.40 వేలు, ఇగ్నిస్ పై రూ.35 వేల వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. కార్పొరేట్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ ఛేంద్ డిస్కౌంట్ ఇలా కారు మోడల్ ని బట్టి ఒక ధరను నిర్ణయించి మొత్తంగా రూ.74 వేల వరకు ఈ ప్రయోజనాలను అందిస్తున్నారు. మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన కారు కొనాలి అని మీరు అనుకుంటే మాత్రం ఇదే మంచి సమయం అని చెప్పాలి. అయితే ఈ డిస్కౌంట్స్ కేవలం జూన్ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీ దగ్గర్లోని మారుతీ డీలర్ ని సంప్రదిస్తే మంచిది.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş