iDreamPost
android-app
ios-app

మారుతీ సుజుకీ క్రేజీ ఆఫర్లు.. మిడిల్ క్లాస్ వాళ్లు కొనేందుకు ఇదే మంచి ఛాన్స్!

  • Published Mar 20, 2024 | 1:38 PM Updated Updated Mar 20, 2024 | 1:39 PM

Maruti Suzuki cars: కొత్త కారు కొనాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ బంపరాఫర్లను ప్రకటించింది. ఆ మోడల్ కార్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Maruti Suzuki cars: కొత్త కారు కొనాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ బంపరాఫర్లను ప్రకటించింది. ఆ మోడల్ కార్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

  • Published Mar 20, 2024 | 1:38 PMUpdated Mar 20, 2024 | 1:39 PM
మారుతీ సుజుకీ క్రేజీ ఆఫర్లు.. మిడిల్ క్లాస్ వాళ్లు కొనేందుకు ఇదే మంచి ఛాన్స్!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కోరుకునేది సౌకర్యవంతమైన జీవితం. సొంతిల్లు ఉండాలి.. ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఓ కారుండాలని ఆలోచిస్తుంటారు. ప్రైవేట్ వెహికిల్స్ కంటే సొంత కారుంటే ఆ కిక్కే వేరుంటుంది. ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోవచ్చు. కారు కొనుక్కునేందుకు కొంత డబ్బును పొదుపు చేసి సొంత కారు కలను తీర్చుకుంటుంటారు. అయితే మీరు ఈ మధ్యన కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఆ మోడల్ కార్లపై క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. మీరు ఆ కార్లను కొనుగోలు చేసినట్లైతే భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు.

మారుతీ కార్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించి సేల్స్ పెంచుకునేందుకు మారుతీ సుజుకీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. మార్చి నెలకు సంబంధించి మారుతీ సుజుకీ కంపెనీ అరేనా శ్రేణిలో కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. నగదు తగ్గింపులతో పాటు ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్‌లను కంపెనీ అందిస్తుంది. ఏయో కార్లపై ఎంత తగ్గింపు అందుబాటులో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాగన్ ఆర్

Heavy discount on maruti cars

మారుతీ సుజుకీ కార్లలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ వ్యాగన్ ఆర్. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ ప్రస్తుతం రూ.5.54 లక్షల నుంచి రూ.7.42 లక్షల మధ్య ధర పలుకుతున్నది. ఈ కారుపై బంపరాఫర్ అందుబాటులో ఉంది. మారుతి వ్యాగన్ ఆర్ కారుపై రూ. 66,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 40,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ , రూ. 5,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ పాటు రూ.6 వేలు కార్పొరేట్ తగ్గింపులు ఉన్నాయి. ఈ తగ్గింపులు వ్యాగన్ ఆర్‌కు సంబంధించిన ఏఎంటీ వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తాయి. రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 88 బీహెచ్పీ విద్యుత్ వెలువరిస్తుంది.

ఆల్టో కే10

Heavy discount on maruti cars

మారుతీ నుంచి మరో బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఆల్టో కే10. మారుతి ఆల్టో కే10కు సంబంధించిన ఏఎంటీ వేరియంట్‌లపై ప్రత్యేకంగా రూ. 45,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే మాన్యువల్ వేరియంట్‌లపై రూ. 40,000 నగదు తగ్గింపును అందిస్తుంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10 ఎక్స్​ట్రా ఎడిషన్​లో బానొట్​ మస్క్యులర్​ లుక్​ను ఇస్తోంది. హెక్సాగొనల్​ హానీకూంబ్​ మెష్​ గ్రిల్​, స్వెప్ట్​బ్యాక్​ హాలోజెన్​ హెడ్​ల్యాంప్స్​, బ్లాక్​డ్​-ఔట్​ స్కిట్​ ప్లేట్స్​ హైలైట్​గా నిలుస్తున్నాయి. బంపర్​ మోంటెడ్​ ఫాగ్​ ల్యాంప్స్​ కూడా లభిస్తుండటం విశేషం.

స్విఫ్ట్

Heavy discount on maruti cars

మార్కెట్ లో మారుతీ స్విఫ్ట్ మోడల్ కు మంచి డిమాండ్ ఉంది. ఈ మోడల్ కారుపై క్రేజీ ఆఫర్ అందుబాటులో ఉంది. మారుతి స్విఫ్ట్ ఏఎంటీ వేరియంట్‌లు రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 7,000 కార్పొరేట్ తగ్గింపుతో వస్తాయి. ఈ కారు మాన్యువల్ వేరియంట్‌లపై రూ. 15,000 నగదు తగ్గింపు అందిస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom