iDreamPost
android-app
ios-app

చూడ్డానికి హీరోయిన్‌లా ఉన్నా బిజినెస్‌లో దుమ్మురేపుతున్న మహిళ!

ఆడవాళ్లకు వ్యాపారాలు అచ్చురావు అన్న నోళ్లకు తమ సక్సెస్‌తో సమాధానం చెబుతున్నారు కొందరు బిజినెస్‌ ఉమెన్‌. వారి ఇన్పిరేషనల్‌ జర్నీ పలువురికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.

ఆడవాళ్లకు వ్యాపారాలు అచ్చురావు అన్న నోళ్లకు తమ సక్సెస్‌తో సమాధానం చెబుతున్నారు కొందరు బిజినెస్‌ ఉమెన్‌. వారి ఇన్పిరేషనల్‌ జర్నీ పలువురికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.

చూడ్డానికి హీరోయిన్‌లా ఉన్నా బిజినెస్‌లో దుమ్మురేపుతున్న మహిళ!

సక్సెస్‌ చేలో పండే పంట కాదు.. ఓ కొంత కాలం తర్వాత చేతికి రావడానికి. ప్రాణం పెట్టి పని చేసినా కొన్ని సార్లు సక్సెస్‌ రావటానికి ఎక్కువ టైం పట్టవచ్చు. ఓపిక ఉండాలి.. ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరించి ముందుకు సాగే గొప్ప గుణం ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రియల్‌ స్టోరీలో.. ఓ మహిళ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి.. వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించింది. అదంతా ఒక్కరోజులో సాధ్యపడలేదు. సంవత్సరాల పాటు కష్టపడింది. ఎన్నో అవాంతరాలను ఎదుర్కోని బిజినెస్‌ ప్రపంచంలో తన కంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమే మామాఎర్త్‌ అధినేత్రి ‘ గజల​ అలగ్‌’.

దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన గజల్‌

గజల్‌ అలగ్‌ హర్యానాలోని గురుగ్రామ్‌లో దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. ఇంటర్‌ వరకు హర్యానాలోనే చదువుకున్నారు. తర్వాత పంజాబ్‌ వెళ్లారు. అక్కడ పంజాబ్‌ యూనివర్శిటీలో కంప్యూటర్‌ ఆప్లికేషన్స్‌లో డిగ్రీ చేశారు. తర్వాత న్యూయార్క్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్‌లో కొన్ని సమ్మర్‌ కోర్సులు చేశారు. పెళ్లి తర్వాత ఆమె జీవితం ఇంటికి పరిమితం కాలేదు. భర్త ప్రోత్సాహంతో ఆమె సొంతంగా ఓ బిజినెస్‌ స్టార్ట్‌ చేశారు.

25 లక్షల పెట్టుబడితో 9 వేల కోట్ల సామ్రాజ్యం..

గజల్‌ 2016లో తన భర్త వరుణ్‌తో కలిసి మామాఎర్త్‌ కంపెనీని మొదలుపెట్టారు. ఇందుకోసం 25 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. గజల్‌ ఎకో ఫ్రెండ్లీ సౌందర్య ఉత్పత్తుల్ని తయారు చేయసాగారు. అవి కూడా తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఈ ఉత్పత్తుల్ని తయారు చేయసాగారు. మొదట్లో మామాఎర్త్‌ ఉత్పత్తులకు పెద్దగా ఆదరణ లభించలేదు. గజల్‌ తయారు చేసే ఉత్పత్తులు ఆర్గానిక్‌.. టాక్సిక్‌ ఫ్రీ కావటంతో జనంలోకి మెల్ల మెల్లగా వెళ్లాయి. తర్వాత ఆన్‌లైన్‌ ద్వారా తమ ఉత్పత్తుల్ని అమ్మటం మొదలుపెట్టారు. ఊహించని విధంగా సేల్స్‌ పెరిగాయి. 25 లక్షలతో ప్రారంభం అయిన కంపెనీ ఇప్పుడు.. 9 వేల 800 కోట్ల కంపెనీగా మారింది. దేశ వ్యాప్తంగా 500లకుపైగా నగరాల్లో​.. 5 మిలియన్ల మంది మామాఎర్త్‌ వస్తువుల్ని వాడుతున్నారు. గత ఏడాది మామాఎర్త్‌ సంస్థ ఏకంగా 14 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చుకుంది.

ఆ 10 మందిలో గజల్‌ అలగ్‌కు చోటు..

ఆడవాళ్లు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నా.. బిజినెస్‌ రంగంలో మాత్రం కొంత వెనకబడిపోయారని చెప్పాలి. మగవారి పనిగా చెప్పుకునే బిజినెస్‌ రంగంలో చాలా కొద్ది మంది మాత్రమే రానిస్తున్నారు. అలాంటి వారిలో మామాఎర్త్‌ అధినేత్రి గజల్‌ అలగ్‌ కూడా ఉన్నారు. తాజాగా, ఐడీఎఫ్‌సీ-హురున్‌ విడుదల చేసిన టాప్‌ 10 యంగెస్ట్‌ సెల్ఫ్‌ మేడ్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యుర్‌ లిస్ట్‌ విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో గజల్‌కు కూడా చోటు దక్కింది. ఆమె మొదటి స్థానంలో నిలిచారు. 9 వేల 800 కోట్ల బిజినెస్‌ను నిర్వహిస్తున్న గజల్‌ అలగ్‌ వయసు 35 సంవత్సరాలు మాత్రమే కావటం విశేషం. మరి, 35 ఏళ్ల 9 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్న గజల్‌ అలగ్‌ సక్సెస్‌ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.