iDreamPost
android-app
ios-app

LPG Cylinder: LPG సిలిండర్ వినియోగదారులకు ఉచితంగా 50 లక్షల బీమా.. పూర్తి వివరాలు

  • Published Jan 06, 2024 | 2:37 PM Updated Updated Jan 06, 2024 | 2:37 PM

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తే.. ఉచితంగా 50 లక్షల రూపాయలు బీమా పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగి ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తే.. ఉచితంగా 50 లక్షల రూపాయలు బీమా పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..

  • Published Jan 06, 2024 | 2:37 PMUpdated Jan 06, 2024 | 2:37 PM
LPG Cylinder: LPG సిలిండర్ వినియోగదారులకు ఉచితంగా 50 లక్షల బీమా.. పూర్తి వివరాలు

ఈమధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇళ్లల్లో, హోటల్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు. దురదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలితే.. ప్రాణ నష్టంతో పాటు.. ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది. అయితే గ్యాస్ సిలిండర్ పేలుడు వంటి ప్రమాదాలు సంభవిస్తే.. సంబంధిత గ్యాస్ కంపెనీల నుంచి పరిహారం పొందేందుకు అవకాశం ఉంది. గరిష్టంగా రూ.50 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. మరి దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే..

పెట్రోలియం కంపెనీలు.. తమ ఎల్‌పీజీ కస్టమర్లందరికీ ఉచిత ప్రమాద బీమా కవరేజీని అందిస్తాయి. అది కూడా రూ.50 లక్షల వరకు ఉంటుంది. ఈ బీమా కవరేజ్ కోసం ఎల్పీజీ కస్టమర్లు.. ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పెట్రోలియం కంపెనీలే తమ వినియోగదారులకు స్వయంగా ఈ కవరేజీని ఉచితంగా అందిస్తాయి.

దీని వల్ల ఎల్‌పీజీ సిలిండర్ పేలుడు వల్ల ఏర్పడే నష్టాన్ని కవర్ చేసుకోవడానికి.. వినియోగదారులు సంబంధిత పెట్రోలియం కంపెనీ నుండి పరిహారం పొందేందుకు అనుమతి ఉంటుంది. ఎల్‌పీజీ కస్టమర్‌లు, వారి కుటుంబ సభ్యులకు సంవత్సరానికి రూ.50 లక్షల వరకు మొత్తం పరిహారం లభిస్తుంది. దీని కింద ఒక కుటుంబంలోని ఒక సభ్యుడు రూ.10 లక్షల వరకు పరిహారం పొందవచ్చు.

ప్రమాదవశాత్తు గ్యాస్ లీకవ్వడం, పేలుడు మొదలైన వాటికి ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. ఇందుకోసం పెట్రోలియం కంపెనీలు.. బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. అందుకే ప్రమాదం జరిగితే.. బీమా కంపెనీలు ఆర్థిక సాయం అందజేస్తాయి.

ఎంత పనిహారం లభిస్తుంది అంటే..

ఎల్‌పీజీ సిలిండర్ వల్ల ప్రమాదం జరిగి.. ఆస్తి నష్టం సంభవిస్తే.. గరిష్టంగా రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో ఎవరైనా వ్యక్తి మరణించిన సందర్భంలో.. రూ. 6 లక్షల మొత్తాన్ని పొందుతారు. గాయం అయితే, ఒక వ్యక్తికి రూ. 2 లక్షల వరకు పరిహారం పొందవచ్చు.

ఎలా క్లెయిమ్ చేయాలంటే.

  • ప్రమాదవశాత్తు గ్యాస్ పేలుడం వంటి ప్రమాదం సంభవిస్తే.. కస్టమర్ కవరేజ్ పొందడానికి.. బీమా కంపెనీని సంప్రదించాల్సిన అవసరం లేదు.
  • సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి ప్రమాదం గురించి ఫిర్యాదు చేయాలి.
  • పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదు కాపీని భద్రంగా ఉంచుకోవాలి.
  • ప్రమాదం గురించి మీరు ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌కు తెలియజేసిన తర్వాత.. ఆ వివరాలు సంబంధిత బీమా కంపెనీకి చేరతాయి.
  • ఆ తర్వత సదరు ఏజెన్సీ ప్రతినిధులు వచ్చి.. విచారణ చేస్తారు.
  • ప్రమాద ఘటన నిజమని నిర్ధారించిన తర్వాత, క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
  • పోలీసు ఫిర్యాదు కాపీ, ఎవరైనా గాయపడితే వారికి అయ్యే వైద్య ఖర్చుల పత్రాలు, మరణ ధృవీకరణ పత్రం లేదా మరణిస్తే పోస్ట్ మార్టం నివేదిక రిపోర్ట్ అన్నింటిని పరిశీలిస్తారు.
  • ఆ తరవాత ఈ పత్రాలన్నింటిని బీమా కంపెనీకి అందించాలి.
  • అప్పుడు బీమా కంపెనీ మకు వాటిల్లిన నష్టం ఆధారంగా డబ్బు అందజేస్తారు.

marsbahis girişjojobet