iDreamPost
android-app
ios-app

LIC న్యూ బీమా పాలసీ.. అదిరిపోయే బెనిఫిట్స్.. మీ పిల్లల భవిష్యత్ బంగారమే!

కస్టమర్ల కోసం ఎప్పుడూ సరికొత్త పాలసీలను ప్రవేశపెట్టే ఎల్ఐసీ తాజాగా మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది. పిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పాలసీలో పొదుపు చేస్తే భవిష్యత్ బంగారమే. పూర్తి వివరాలు మీకోసం.

కస్టమర్ల కోసం ఎప్పుడూ సరికొత్త పాలసీలను ప్రవేశపెట్టే ఎల్ఐసీ తాజాగా మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది. పిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పాలసీలో పొదుపు చేస్తే భవిష్యత్ బంగారమే. పూర్తి వివరాలు మీకోసం.

LIC న్యూ బీమా పాలసీ.. అదిరిపోయే బెనిఫిట్స్.. మీ పిల్లల భవిష్యత్ బంగారమే!

సంపాదించిన సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని రోజులు అనుకూలంగా ఉంటాయని చెప్పలేము కదా. ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో ఊహించలేము. అలాంటి సందర్భాల్లో పొదుపు చేసుకున్న సొమ్ము ఆర్థికపరమైన అవసరాలను తీరుస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలున్నాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వ రంగానికి చెందిన ఎల్ఐసీలో పొదుపు చేస్తే అధిక లాభాలు అందుకోవడం ఖాయం. దీంతో కస్టమర్ల నుంచి ఎల్ఐసీ పాలసీలకు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా పిల్లల కోసం కొత్త బీమా పథకాన్ని ప్రవేశ పెట్టింది. అద్భుతమైన బెనిఫిట్స్ అందేలా అమృత్ బాల్ పేరిట ఎల్ఐసీ కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

దేశీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ పిల్లల కోసం ప్రత్యేకంగా అమృత్ బాల్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా పిల్లలకు భవిష్యత్తులో పై చదువులకు, ఇతర అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ పాలసీలో పెట్టుబడి పెట్టినట్లైతే మీ పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుందంటున్నారు పలువురు నిపుణులు. అమృత్ బాల్ పాలసీ ప్లాన్ నంబర్ 874. ఇది నాన్ లింకెడ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్. కాగా ఈ పాలసీ ఫిబ్రవరి 17 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ జీవిత బీమా పథకంలో పొదుపు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు ఏడాదికి రూ. 80 అదనపు రాబడి వస్తుంది.

ఎవరు అర్హులు, ప్రయోజనాలు ఏంటంటే:

అమృత్ బాల్ పాలసీ పిల్లల కోసం ప్రవేశ పెట్టబడిన పాలసీ. 30 రోజుల నుంచి 13 ఏళ్ల లోపు వయసు గల పిల్లలకు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ కనీస మెచ్యూరిటీ వయస్సు 18 సంవత్సరాలు అలాగే గరిష్టంగా 25 సంవత్సరాలుగా ఉంటుంది. ఎల్ఐసీ అమృత్ బాల్ పాలసీలో కనీస మొత్తం రూ. 2లక్షల నుంచి పొదుపు చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ప్రీమియం చెల్లింపు వ్యవధి ఐదేళ్ల నుంచి ఆరు, ఏడేళ్ల ఆప్షన్లను ఎంచుకోవచ్చు. కాగా గరిష్ట ప్రీమియం చెల్లింపు వ్యవధి 10 సంవత్సరాలు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికోసారి ప్రీమియం చెల్లించే సౌలభ్యం ఉంటుంది.

మీరు సింగిల్ ప్రీమియం చెల్లింపు ఎంపికను ఎంచుకోవాలనుకుంటే, మీరు దానిని కూడా ఎంచుకోవచ్చు. అయితే, ప్లాన్ కింద మీరు కనీసం రూ. 2 లక్షల బీమా మొత్తాన్ని తీసుకోవాలి. మీరు 5వ, 10వ లేదా 15వ సంవత్సరంలో మనీ బ్యాక్ ప్లాన్ వంటి మెచ్యూరిటీ సెటిల్‌మెంట్ తీసుకోవచ్చు. ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసే వారు మెచ్యూరిటీపై సమ్ అష్యూర్డ్, గ్యారెంటీ రిటర్న్‌ల ప్రయోజనాన్ని పొందుతారు. పాలసీని తీసుకునే వ్యక్తులు ‘సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్’ ఎంపికను కూడా ఎంచుకోవచ్చు. ఈ పాలసీ ద్వారా అసరమైనప్పుడు రుణాలను పొందవచ్చు. ఈ పాలసీ పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.