iDreamPost
android-app
ios-app

LIC రూపురేఖలు మార్చేయబోతున్న INFOSYS! కస్టమర్స్ హ్యాపీ!

LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రూపురేఖలు మార్చేయబోతోంది ఇన్ఫోసిస్. టెక్నాలజీని అప్ డేట్ చేసుకునేందుకు ఇన్ఫోసిస్ తో చేతులు కలిపింది. దీతో కస్టమర్లకు సేవలు మరింత సులువుకానున్నాయి.

LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రూపురేఖలు మార్చేయబోతోంది ఇన్ఫోసిస్. టెక్నాలజీని అప్ డేట్ చేసుకునేందుకు ఇన్ఫోసిస్ తో చేతులు కలిపింది. దీతో కస్టమర్లకు సేవలు మరింత సులువుకానున్నాయి.

LIC రూపురేఖలు మార్చేయబోతున్న INFOSYS! కస్టమర్స్ హ్యాపీ!

ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల కోసం అద్భుతమైన పాలసీలను అందిస్తోంది. ఎల్ఐసీ పాలసీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా గ్యారంటీ రిటర్స్న్ తో పాటు పెట్టుబడి భద్రంగా ఉండడంతో ఈ పాలసీలకు ఆదరణ పెరిగింది. ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను తీసుకొస్తుంది ఎల్ఐసీ. కోట్లాది మంది పాలసీహోల్డర్లను కలిగి ఉండి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే పాలసీదారులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ఎల్ఐసీ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయింది. ఏ సమాచారం కావాలన్నా దాదాపు ఆన్ లైన్ లోనే లభిస్తున్నది.

ఈ క్రమంలోనే ఎల్ఐసీ పాలసీలకు సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ రూపంలో అందించేందుకు టెక్నాలజీని డెవలప్ చేసేందుకు రెడీ అవుతోంది. ఏ కంపెనీకి అయినా టెక్నాలజీ ఎంతో ముఖ్యం. టెక్నాలజీని అందుకోకపోతే సంస్థ మనుగడ సాధించలేదు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు దిగ్గజ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ తో చేతులు కలిపింది. దీంతో ఎల్ఐసీ రూపురేఖలను మార్చేందుకు రెడీ అవుతోంది ఇన్ఫోసిస్. కస్టమర్లకు మెరుగైన సేవలు అందుబాటులోకి రానుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్ఫోసిస్ కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్ హాన్స్ మెంట్ అనే డిజిటల్ ట్రాన్స్ ఫర్ మేషన్ కు నాయకత్వం వహించడానికి ఎల్ఐసీకి తన సహకారాన్ని ప్రకటించింది. త్వరలోనే నెక్ట్స్ జెన్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ను రూపొందించడాన్ని ప్రారంభింస్తుంది. ఇది ఎల్ఐసీ కస్టమర్లు, ఏజెంట్స్, ఉద్యోగులకు ఓమ్నీ చానల్ ఎంగేజ్ మెంట్, డేటా ఆధారిత హైపర్ పర్సనలైజ్డ్ అనుభవాలను అందించడంపై దృష్టిపెడుతుంది. ఏఐ, క్లౌడ్ నైపుణ్యాలను ఎల్ ఐసీలో ప్రవేశపెట్టనున్నది. ఈ విషయాన్ని ఎల్ఐసీ సీఈవో వెల్లడించారు. డిజిటల్ ట్రాన్ఫర్ మేషన్ తో ఎల్ఐసీ రూపురేఖలు మారే అవకాశం ఉంది. సాంకేతికతతో ఎల్ఐసీ కస్టమర్లకు సేవలు మరింత సులువు కానున్నాయి. పరిష్టమైన టెక్నాలజీతో మోసాలకు అడ్డుకట్ట పడుతుంది.