iDreamPost
android-app
ios-app

రైతులకు శుభవార్త.. రూ.3 లక్షలు పొందే ఛాన్స్‌.. వెంటనే ఇలా పొందండి!

  • Published Jun 09, 2024 | 1:34 PM Updated Updated Jun 09, 2024 | 1:34 PM

అన్నదాతలను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తెచ్చాయి. వాటిల్లో ఒక దాని గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. దీని కింద 3 లక్షల రూపాయలు పొందవచ్చు. ఆ వివరాలు..

అన్నదాతలను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తెచ్చాయి. వాటిల్లో ఒక దాని గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. దీని కింద 3 లక్షల రూపాయలు పొందవచ్చు. ఆ వివరాలు..

  • Published Jun 09, 2024 | 1:34 PMUpdated Jun 09, 2024 | 1:34 PM
రైతులకు శుభవార్త.. రూ.3 లక్షలు పొందే ఛాన్స్‌.. వెంటనే ఇలా పొందండి!

రైతే రాజు.. అన్నదాతే దేశానికి వెన్నుముక అంటారు. అలాంటి రైతు బాగుండాలని.. ఆర్థికంగా వృద్ధి చెందాలని భావించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రారంభించాయి. పెట్టుబడి సాయం, పంటలకు మద్దతు ధర ప్రకటించడం వంటి నిర్ణయాలు తీసుకుంటాయి. అలానే ప్రకృతి వైపరీత్యాల వేళ నష్టపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు బీమా పథకాలను తీసుకు వచ్చాయి. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రూ.6 వేలు అందజేస్తోన్న సంగతి తెలిసిందే. అలానే రైతులు వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం వారికి అనేక రకాల పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్నదాతలు 3 లక్షల ప్రయోజనం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ మొత్తాన్ని పొందాలంటే ఏం చేయాలంటే..

వ్యవసాయ కార్యక్రమాల కోసం అన్నదాతలు వడ్డీ వ్యాపారులు వద్ద నుంచి అప్పులు తీసుకుని ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారికి తక్కువ వడ్డీకి రుణాల ఇవ్వాలని భావించింది. దీని కోసం కేంద్ర ప్రభత్వుం.. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ (కేసీసీ స్కీమ్‌) తీసుకొచ్చింది. వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల ద్వారా సకాలంలో రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం. అర్హులైన రైతులు ఈ స్కీమ్‌ ద్వారా అతి తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంక్‌ల నుంచి లోన్‌లు పొందవచ్చు

ఇలా పొందిన రుణాలతో రైతులు తమ వ్యవసాయ కార్యక్రమాలు అంటే.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడం వంటి వ్యవసాయ అవసరాలను తీర్చుకోవచ్చు. ఇక ఈ క్రెడిట్ కార్డు మీద రైతులకు ఎలాంటి పూచీ లేకుండా రూ.1.6 లక్షల లోన్ అందిస్తుంది. కేసీసీ స్కీమ్‌ ద్వారా రైతులు 5 సంవత్సరాల పాటు రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ వ్యాలిడిటీ 5 సంవత్సరాలు. కేసీసీ రుణాల కింద అన్ని నోటిఫైడ్ పంటలు లేదా ప్రాంతాలు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పరిధిలోకి వస్తాయి. దేశంలో దాదాపు 7.5 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డ్ అకౌంట్లు ఉన్నాయి. దేశంలోని కమర్షియల్‌ బ్యాంకులు, రీజినల్‌ రూరల్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లు, స్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీల్లో కేసీసీల ద్వారా లోన్‌లు పొందవచ్చు.

రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 సంవత్సరాలలో రూ.3 లక్షల వరకు షార్ట్‌ టర్మ్‌ లోన్‌ తీసుకోవచ్చు. దీని కింద అన్నదాతలకు 9 శాతం వడ్డీ రేటుతో రుణాలు లభిస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం దానిపై 2 శాతం సబ్సిడీ ఇస్తుంది. అందువల్ల రైతులు కేసీసీ పథకం కింద తీసుకున్న రుణం మీద కేవలం 7 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. రైతు రుణాన్ని సకాలంలో చెల్లిస్తే, ప్రభుత్వం మరో 3 శాతం రాయితీ ఇస్తుంది. అంటే మొత్తం లోన్‌పై కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

వీరే అర్హులు..

18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారు కేసీసీకి అప్లై చేసుకోవచ్చు. యజమానులు, కౌలు రైతులు, స్వయం సహాయక సంఘాలకు చెందిన కౌలు రైతులు కూడా కేసీసీ ద్వారా లోన్‌ పొందవచ్చు. పశుపోషణ, చేపల పెంపకం, పౌల్ట్రీ ఫామ్‌ రైతులు కూడా దీని కింద లోన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలంటే..

  • కేసీసీ ద్వారా లోన్‌ పొందాలంటే.. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ లింక్‌ ఓపెన్‌ చేయాలి.
  • తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ఈ ఫామ్‌లో అడిగిన ఇతర సమాచారాన్ని నింపాలి.
  • వీటితో పాటు మీరు ఏదైనా బ్యాంక్ లేదా బ్రాంచ్‌లో కిసాన్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే ఆ వివరాలు తప్పక పొందుపరచాలి.
  • ఆఫామ్‌ను సమీప బ్యాంకు బ్రాంచులో అందజేయాలి.
  • ఈ స్కీమ్‌కు అప్లై చేసే రైతుల ఐడీ ప్రూఫ్ కోసం ఓటరు ఐడీ కార్డ్, పాన్‌ కార్డ్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించవచ్చు.
  • అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్‌, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లు అవసరం.