iDreamPost
android-app
ios-app

సంపన్నుడిగా పుట్టి.. సాధారణ కార్మిడిగానే ప్రస్థానం ప్రారంభించి..

  • Published Oct 10, 2024 | 11:32 AM Updated Updated Oct 10, 2024 | 11:32 AM

Ratan Tata Biography: ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గొప్ప మనసు అతి కొద్దిమందికే ఉంటుంది.. అలాంటి గొప్ప వ్యక్తుల్లో ఒకరు రతన్ టాటా. ఆయన తన 86 ఏట అనారోగ్య సమస్యల కారణంగా ముంబాయిలోని బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో కన్నుమూశారు.

Ratan Tata Biography: ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గొప్ప మనసు అతి కొద్దిమందికే ఉంటుంది.. అలాంటి గొప్ప వ్యక్తుల్లో ఒకరు రతన్ టాటా. ఆయన తన 86 ఏట అనారోగ్య సమస్యల కారణంగా ముంబాయిలోని బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో కన్నుమూశారు.

  • Published Oct 10, 2024 | 11:32 AMUpdated Oct 10, 2024 | 11:32 AM
సంపన్నుడిగా పుట్టి.. సాధారణ కార్మిడిగానే ప్రస్థానం ప్రారంభించి..

దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ సంస్థల అధినేత రతన్ టాటా (86) అనారోగ్యంతో బుధవారం ముంబాయిలోని బ్రీచ్ క్యాండి హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు తెలుపుతున్నారు. ఆయన గొప్ప సామాజికవేత్త.. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో నిరుపేదలకు సాయమందించారు. ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వానికి మారు పేరు టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.  దేశ కీర్తిని ఖండాంతరాలు దాటించిన తేజం. ఒక రకంగా చెప్పాలంటే దేశ వ్యాపార రంగానికే ఆయన పర్యాయపదం అనేవారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండే గొప్పత మనస్తత్వం కలిగిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

రతన్ టాటా ఈ పేరు గురించి భారతీయులకు ప్రత్యేక పరిచయం అక్కరలేదు. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామా..ఉప్పు నుంచి ఉక్కు వరకు.. టీ నుంచి ట్రక్స్ వరకు ఎన్నో ఉత్పత్తులు కేరాఫ్ అడ్రస్. సుమారు ఆరు లక్షల కోట్ల విలువతో దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులతో దేశంలోనే అతి పెద్ద వ్యాపార వేత్తగా మొదటి స్థానంలో ఉన్నారు. రతన్ టాటా జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నారు. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన జీవితం ఒక సాధారణ కార్మికుడిగానే మొదలైందన్న విషయం వింటే ఆశ్చర్యం వేస్తుంది.. కానీ ఇది నిజం. నవల్ హూర్మూజీ టాటా, సూను ల ప్రథమ సంతానంగా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు రతన్ టాటా.

‘టాటా గ్రూప్స్’ ని స్థాపించిన జమ్‌షెడ్‌జీ టాటా మునిమనవడు రతన్ టాటా. కాంపెయిన్ స్కూల్ లో విద్యనభ్యసించిన ఆయన ఉన్నత విద్య కోసం అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆయనకు వాస్తవిక జీవితం ఏంటో తెలిసింది. అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ నిబంధనల మేరకు పంపే ఒకటీ అరా డాలర్లు ఆయన అవసరాలు తీరేవి కావు. అందుకోసం చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు. సంపన్న కుటుంబంలో పుట్టిన రతన్ టాటా ప్రస్థానం ఒక సాధారణ కార్మికుడిగానే ప్రారంభం అయ్యింది.   జేఆర్‌డి టాటా సలహా మేరకు ఆయన స్వదేశానికి వచ్చారు.  అప్పటికే ఆయన తండ్రి టాటా గ్రూప్ లో డిప్యూటీ చైర్మన్.

తాతా, తండ్రి గొప్పలు చెప్పుకొని ఉన్నత ఉద్యోగంలో చేరకుండా కార్మికుల పరిస్థితులు క్షుణ్ణంగా అభ్యసించడానికి జెమ్‌షెడ్‌పూర్ లోని టాటా స్టీల్ ఉత్పత్తి విభాగంలో సాధారణ కార్మికుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టారు. వేలాది మంది ఉద్యోగులతో కలిసి నిప్పుల కొలిమి దగ్గర పనిచేశారు. అప్పట్లో చాలా మంది కార్మికులకు ఆయన ఎవరన్న విషయాన్ని కూడా తెలియనివ్వకుండా సాధారణ జీవితం గడిపారు. అలా 1962లో అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ఆయన ఉద్యోగ జీవితం తొమ్మిదేళ్ళ పాటు రక రకాల పనులతో అక్కడే కొనసాగింది. 1991లో ‘టాటా సన్స్’ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. 1991 మార్చి డిసెంబర్ 2012 వరకు టాటా సన్స్ చైర్మన్ గా టాగా గ్రూప్ ని నడిపించారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్స్ సంస్థ 100 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఆయన ఎంతగారో కృషి చేశారని అంటారు.