Dharani
Jio TV App-Without Set Up Box: రిలయన్స్ జియో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సెట్‌టాప్ బాక్స్ అసవరం లేకుండానే టీవీ వీక్షించవచ్చు. అదేలా అంటే..
Jio TV App-Without Set Up Box: రిలయన్స్ జియో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సెట్‌టాప్ బాక్స్ అసవరం లేకుండానే టీవీ వీక్షించవచ్చు. అదేలా అంటే..
Dharani
రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో పెను సంచలనాలకు నాంది పలికింది. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు జీబీల కొద్ది డేటా ఇస్తూ.. అప్పటి వరకు ఈ రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్, వీఐ వంటి ప్రైవేటు టెలికాం దిగ్గజాలను వెనక్కి నెట్టింది. వాటికి గట్టి పోటీ ఇస్తూ.. నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. టెలికాం రంగానికి మాత్రమే పరిమితం కాకుండా టీవీ విభాగంలోనూ ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది. టీవీ సేవలను క్రమంగా విస్తరిస్తోంది. ఇందుకోసం జియో సెట్‌టాప్ బాక్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ కనెన్లు తీసుకున్న వారికి సెటప్‌బాక్స్‌లో జీయో టీవీ+ యాప్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇకపై సెట్‌టాప్ బాక్స్‌ల అవసరం లేకుండానే.. జియో టీవీ సేవలను ఆనందించోచ్చు అంటున్నారు. ఆ వివరాలు..
అయితే ఇకపై జీయోటీవీ+ యాప్ సేవలను పొందడానికి ఇకపై సెట్‌టాప్ బాక్స్‌లు అవసరం లేదని జియో తెలిపింది. ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే టీవీల్లో జియో టీవీ+ సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ జియో తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే.. సుమారు 800 డిజిటల్ ఛానెల్స్‌ను వీక్షించే అవకాశం లభిస్తుంది. అన్ని స్మార్ట్‌టీవీల్లో జియో టీవీ+ యాప్ అందుబాటులోకి రానుంది.
ఈ యాప్ ద్వారా.. కేవలం ఛానల్స్ మాత్రమే కాకుండా జియో సినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5 వంటి ఓటీటీ యాప్స్‌ను కూడా వినియోగించొచ్చు. అయితే ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ సబ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రేక్షకులు క్వాలిటీతో కూడిన కంటెంట్‌ను వీక్షించే అవకాశం లభిస్తుంది.
జియో ఎయిర్ ఫైబర్ ఉపయోగించే వారు అన్ని ప్లాన్లపైనా.. జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ ఉపయోగించే వారు రూ. 599, రూ. 899 ఆపై ప్లాన్లు తీసుకున్న వారు ఈ యాప్‌లో లాగిన్ అయ్యి తమకు నచ్చిన కంటెంట్ వీక్షించవచ్చు. జియో ఫైబర్ ప్రీపెయిడ్ యూజర్లు అయితే రూ.999 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ప్లాన్లు తీసుకొని ఉండాలి. అయితే సామ్‌సంగ్ టీవీ యూజర్లు ఈ యాప్‌ను ఉపయోగించుకునే అవకాశం లేదు. వీళ్లు కచ్చితంగా సెటప్ బాక్స్‌ను ప్రత్యేకంగా తీసుకోవాల్సిందే.