iDreamPost
android-app
ios-app

జియో కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త…ఆ ప్లాన్ లో భారీ మార్పులు!

Jio New 999 Recharge Plane: ఇటీవల యూజర్లకు భారీ షాకిచ్చింది. రీఛార్జ్ ధరలు పెంచిన యూజర్లను జియో షాకి గురి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తన వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది.

Jio New 999 Recharge Plane: ఇటీవల యూజర్లకు భారీ షాకిచ్చింది. రీఛార్జ్ ధరలు పెంచిన యూజర్లను జియో షాకి గురి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తన వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది.

జియో కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త…ఆ ప్లాన్ లో భారీ మార్పులు!

ఇటీవలే టెలికాం సంస్థలు యూజర్లకు భారీగా షాకిచ్చిన సంగతి తెలిసిందే. తొలుత రిలయన్స్ జియో రీఛార్జీ ప్లాన్ ధరలు పెంచగా… ఆ తరువాత అదే బాటలో మిగిలిన కంపెనీలు కూడా పట్టాయి. మొత్తంగా అన్నీ టెలికాం సంస్థలు భారీగా రీఛార్జీ ధరలు పెంచి…కస్టమర్లకు గట్టి షాకిచ్చారు. దీంతో పెరిగిన ధరలపై సామాన్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే జియో..తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాక ఓ రీఛార్జీ ఫ్లాన్ విషయంలో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మరి.. శుభవార్త ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రిలయన్స్ జియో..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టెలికాం రంగంలోకి ఈ సంస్థ ఎంట్రీ ఇచ్చిన తరువాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా రీఛార్జీ ప్లాన్ ధరల్లో పెనుమార్పులు వచ్చాయి. ఇక జియో దెబ్బకు మిగిలిన టెలికాం సంస్థలు కూడా ధరల్లో మార్పులు చేశాయి. ఇక జియో అయితే అనేక రకాల ప్లాన్లు  తీసుకొచ్చి వినియోగాదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. ఇంకా చెప్పాలంటే.. జియో రాకముందు జియో వచ్చిన తరువాత అన్నట్లు టెలికాం రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఇలా టెలికాం సెక్టార్ లో తనదైన మార్క్ నువేసిన జియో.. ఇటీవల యూజర్లకు భారీ షాకిచ్చింది. రీఛార్జ్ ధరలు పెంచిన యూజర్లను జియో షాకి గురి చేసింది.

అంతేకాక జియోను చూసి.. మిగిలిన టెలికాం సంస్థలు కూడా టారీఫ్ ఛార్జీలు పెంచాయి. ఇలా కస్టమర్లకు షాక్ ఇచ్చిన జియో ..తాజాగా కాస్తా ఉపశమనం ఇచ్చింది. ఓ రీఛార్జీ ఫ్లాన్ విషయంలో కొన్ని మార్పులు చేసి..తిరిగి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఉన్న రూ.999 ప్లాన్ ను తిరిగి తీసుకొచ్చింది. టారిఫ్ ఛార్జీలు పెంచిన తరువాత ఈ ఫ్లాన్ ను రూ.1,199కు పెంచింది. అయితే ‘హీరో 5జీ’ పేరిట దీన్ని పాత ధరకే అందుబాటులోకి తెచ్చింది. అలాగే వ్యాలిడిటీని 84 రోజుల నుంచి 98 రోజులకు పెంచింది. ఈ 98 రోజుల సర్వీస్ వాలిడిటీ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, 2జీబీ రీ డేటాతో వస్తుంది. ఇది 2జీబీ రోజువారీ డేటాతో కూడిన ప్లాన్ కాబట్టి, ఇది అపరిమిత 5జీ డేటాతో కూడా వస్తుంది. గతంలో ఈ ప్లాన్ లో డైలీ 3 జీబీ డేటా ఉండేది. ఈ 3జీబీ డేటాను 2జీబీకి కుదిస్తూ ప్లాన్ లో మార్పులు చేసింది. ఈ ప్లాన్ పై కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు డేటాను తగ్గించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి.. జియో తీసుకొచ్చిన ఈ 999 ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి