iDreamPost
android-app
ios-app

జియో నుంచి క్రేజీ రీచార్జ్ ప్లాన్.. తక్కువ ధరకే డైలీ 2జీబీ డేటా.. మరెన్నో బెనిఫిట్స్

  • Published Sep 22, 2024 | 6:35 PM Updated Updated Sep 22, 2024 | 6:35 PM

Jio Prepaid Recharge: జియో కస్టమర్లకు అదిరిపోయే కొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. తక్కువ ధరకే మంచి బెనిఫిట్స్ అందుకోవచ్చు.

Jio Prepaid Recharge: జియో కస్టమర్లకు అదిరిపోయే కొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. తక్కువ ధరకే మంచి బెనిఫిట్స్ అందుకోవచ్చు.

  • Published Sep 22, 2024 | 6:35 PMUpdated Sep 22, 2024 | 6:35 PM
జియో నుంచి క్రేజీ రీచార్జ్ ప్లాన్.. తక్కువ ధరకే డైలీ 2జీబీ డేటా.. మరెన్నో బెనిఫిట్స్

టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం అని చెప్పొచ్చు. అనతికాలంలోనే కోట్లాదిమంది యూజర్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది జియో. ఫ్రీగా సిమ్ కార్డులు అందిస్తూ.. ఉచితంగా డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఇస్తూ మిగతా కంపెనీలకు గట్టిపోటినిచ్చింది. ఈ క్రమంలో టారిఫ్ ధరలను పెంచిన తర్వాత జియో కస్టమర్లు నిరాశ చెందారు. భారీగా పెరిగిన రీచార్జ్ ధరలతో జియో నుంచి చాలా మంది తక్కువ ధరకే రీచార్జ్ ప్లాన్స్ అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ కు మారారు.

అయితే కస్టమర్లను నిలుపుకునేందుకు జియో మళ్లీ చౌకైన ప్లాన్స్ ను తీసుకొస్తున్నది. తక్కువ ధరకే రీచార్జ్ ప్లాన్స్ ను అందిస్తున్నది. ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించేవారి కోసం అద్భుతమైన ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. మరో కొత్త ప్లాన్ తో జియో ఆకర్షిస్తోంది. తాజాగా రూ. 198 ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ పై మీరూ ఓ లుక్కేయండి.

మీరు డేటా ఎక్కువగా వినియోగిస్తారా? ఎక్కువ డేటా అందించే ప్లాన్ల కోసం చూస్తున్నారా? అయితే జియో అందిస్తున్న ఈ కొత్త ప్లాన్ ను రీచార్జ్ చేసుకోండి. రిలయన్స్ జియో 198 రూపాయల డేటా ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 198 రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటాతో పాటు అన్ లిమిటెడ్ 5జీ డేటాను పొందొచ్చు. 14 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్యాక్ అందుబాటులో ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పొందొచ్చు. జియో టీవి, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తున్నది. జియో కస్టమర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet