iDreamPost
android-app
ios-app

ఇషా అంబానీ కార్లు చూస్తే కళ్లు తిరుగుతాయి.. ఒక్కటే రూ.6.95 కోట్లు

  • Published May 16, 2024 | 11:15 AM Updated Updated May 16, 2024 | 11:15 AM

దేశ దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనయ ఇషా అంబానీని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ.. సంస్థ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతుంది. కాగా, ఆమె విలాసవంతమైన బంగ్లాలోనే కాదు..

దేశ దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనయ ఇషా అంబానీని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ.. సంస్థ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతుంది. కాగా, ఆమె విలాసవంతమైన బంగ్లాలోనే కాదు..

  • Published May 16, 2024 | 11:15 AMUpdated May 16, 2024 | 11:15 AM
ఇషా అంబానీ కార్లు చూస్తే కళ్లు తిరుగుతాయి.. ఒక్కటే రూ.6.95 కోట్లు

అపర కుబేరుడు, దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ తండ్రి వారసత్వాన్ని పుణుకు పుచ్చుకుని వ్యాపార రంగంలోనే కొనసాగుతున్న సంగతి విదితమే. రిలయన్స్ ఇండస్ట్రీ బోర్డు సభ్యురాలిగా, సంస్థకు సంబంధించిన పలు కంపెనీల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇషాకు ప్రముఖ బిజినెస్‌మెన్ ఆనంద్ పిరమాల్‌తో వివాహం జరిగిన సంగతి విదితమే. ఇక ఆమెకున్న ఆస్తులు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక విలావసంతమైన బంగ్లాతో పాటు ఇక కార్ల కలెక్షన్లు కూడా చాలా ఉన్నాయి. మార్కెట్‌లో కొత్త కారు వస్తే.. కచ్చితంగా ఆమె గ్యారేజీలో ఉండాల్సిందే. ఇంతకు ఆమె దగ్గర ఏమేమీ కార్లు ఉన్నాయంటే..?

ఇషా అంబానీ వద్ద ఉన్న ఖరీదైన కార్లలో ఒకటి మెర్సిడెస్ బెంజ్.. మార్కెట్‌లో ధర రూ. 1.77 కోట్ల నుంచి రూ. 1.86 కోట్లు ఉంటుంది. ఇది డీజిల్ అండ్ పెట్రోల్‌తో నడుస్తుంది. ఇందులో 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్,  3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇక సామాన్యుడి కూడా తిరగాలనుకునే లగ్జరీ కార్ బిఎండబ్య్లూ.  ఇషా దగ్గర  BMW 7 సిరీస్ ఉంది.  గ్లోబల్ మార్కెట్లో అధిక భద్రతా ఫీచర్లు, లగ్జరీ సౌకర్యాలు ఈ కారులోనే ఉన్నాయి. ఈ కారు మోడల్ ధర రూ. 1.82 కోట్ల నుంచి రూ. 1.84 కోట్ల ధరలో ఉంటుంది.  అయితే ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. ఈ కారులో 3.0-లీటర్ పెట్రోల్ మరియు 3.0 లీటర్ డీజిల్ మోటార్ ఆప్షన్‌లతో కూడిన హై-పవర్ మోడల్ ఉంది.

IShaa ambani

పోర్స్చే కేమాన్ S  కూడా ఉంది. దీని ఎక్స్ -షోరూమ్ విలువ రూ. 1.48 కోట్లు. ఈ కారు 3436 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఆమె దగ్గర ఉన్న అత్యంత తక్కువ ధర కారు ఏంటో తెలుసా.. రోంజ్ రేవర్. దీని ధర రూ. 67.60 లక్షలు. ఇక రోల్స్ రాయిల్స్ కల్లినస్ కూడా ఉంది.  దీని ధర రూ. 6.95 కోట్లు(ఎక్స్-షోరూమ్). ఇది అత్యంత విలాసవంతమైన ఫీచర్లు,  అత్యంత శక్తివంతమైన మోటారును కలిగి ఉన్న లగ్జరీ కారు కావడం విశేషం. ఇషా అంబానీ తన ప్రయాణాలకు ఎక్కువగా ఈ కారునే ఉపయోగిస్తుంటారు. ఈ కారు మోడల్‌లో 6.5 లీటర్ V12 పెట్రోల్ ఇంజిన్ అమర్చారు.  8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడి ఉంటుంది. అధిక పనితీరు, అధిక లగ్జరీ ఫీచర్ల కారణంగా ఇషా అంబానీ ఈ కారును తన ప్రధాన యుటిలిటీ వాహనంగా వినియోగిస్తూ ఉంటుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom