iDreamPost
android-app
ios-app

ప్రతి నెలా ఆదాయం కావాలా?.. అయితే పెట్టుబడి పెట్టేందుకు ఈ స్కీమ్స్ బెస్ట్

  • Published May 11, 2024 | 6:34 PM Updated Updated May 11, 2024 | 6:34 PM

మీరు ప్రతి నెల కొంత ఆదాయం ఉంటే బాగుండని ఆలోచిస్తున్నారా. అయితే ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టండి నెల నెలా ఆదాయం పొందొచ్చు. ఆ పథకాలు ఏవంటే?

మీరు ప్రతి నెల కొంత ఆదాయం ఉంటే బాగుండని ఆలోచిస్తున్నారా. అయితే ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టండి నెల నెలా ఆదాయం పొందొచ్చు. ఆ పథకాలు ఏవంటే?

  • Published May 11, 2024 | 6:34 PMUpdated May 11, 2024 | 6:34 PM
ప్రతి నెలా ఆదాయం కావాలా?.. అయితే పెట్టుబడి పెట్టేందుకు ఈ స్కీమ్స్ బెస్ట్

ఉన్న వారికైనా.. లేనివారికైనా ఇంకా కావాలనిపించేది డబ్బు మాత్రమే. డబ్బు చేతిలో ఉంటే ఆ ధైర్యమే వేరుంటుంది. అందుకే మనీ విషయంలో చాలా జాగ్రత్త పడుతుంటారు. అధికంగా డబ్బు సంపాదించేందుకు నిత్యం పరితపిస్తుంటారు. డబ్బు సంపాదన కోసం బిజినెస్ చేయాలా? ఉన్న డబ్బును తీసుకెళ్లి మంచి పథకాల్లో పెట్టుబడి పెట్టాలా అని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు పొదుపు చేసే డబ్బు భవిష్యత్ అవసరాలను తీరుస్తుంది. ఆపదలు చెప్పిరావు కదా. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు మీరు పొదుపు చేసుకున్న సొమ్మే మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు వృద్ధాప్యంలో ఏ చీకుచింత లేకుండా జీవించాలంటే నెల నెల కొంత ఆదాయం ఉండాలి. మరి ప్రతి నెల ఆదాయం పొందాలంటే ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే మేలంటున్నారు నిపుణులు.

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మంచి రాబడినిచ్చే పథకాలను ప్రవేశపెడుతోంది. వాటిల్లో సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, అటల్ పెన్షన్ స్కీమ్, మంత్‌లీ ఇన్‌కం స్కీమ్ అధిక రాబడినిచ్చే పథకాలు. ఈ పథకాల్లో పెట్టుబడిపెడితే మంచి లాభాలను పొందొచ్చు. అదే విధంగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్:

ఈ పథకంలో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వ్యక్తి లేదంటే జీవిత భాగస్వా మితో ఉమ్మడి ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ పథకంలో జనవరి 1, 2024 నుంచి ప్రతి నెలా రూ.20 వేలు పెట్టుబడి పెట్టే వారికి ఏడాదికి 8.2 శాతం వడ్డీ అందిస్తుంది. కేవలం 1000 రూపాయలతో ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో 5 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 30 లక్షల వరకు ఉంటుంది. రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 2,46,000 వడ్డీ వస్తుంది. అంటే మీకు నెలకు రూ. 20,500 ఆదాయం సమకూరుతుందన్నమాట.

అటల్ పెన్షన్ స్కీమ్:

ఈ పథకంలో 18 నుంచి 40 ఏళ్లలోపు వారు చేరొచ్చు. 60ఏళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడిపై ఆదారపడి ప్రతి నెల పెన్షన్ రూపంలో ఆదాయం సమకూరుతుంది. ఈ స్కీమ్ లో చేరే వ్యక్తుల వయసును బట్టి చెల్లించే మొత్తం మారుతుంటుంది. పెట్టిన పెట్టుబడిపై 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3 వేలు, 4 వేలు, గరిష్టంగా రూ. 5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ. 42 నుంచి గరిష్టంగా రూ. 210 వరకు చెల్లించాలి. ఒక వేళ నెలకు రూ. 210 చెల్లించాలనుకుంటే.. రోజుకు రూ. 7 ఆదా చేస్తే చాలు. 60ఏళ్లు నిండిన తర్వాత రూ. 5 వేల పెన్షన్ అందుకోవచ్చు.

మంత్‌లీ ఇన్‌కం స్కీమ్:

పోస్టాఫీస్ మంత్‌లీ ఇన్‌కం స్కీంలో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకం కాల వ్యవధి ఐదు సంవత్సరాలు. ఐదేళ్ల పాటు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ఐదేళ్ల మెచ్యూరిటీ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం వస్తుంది. దీంట్లో వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. సింగిల్ అకౌంట్ కింద గరిష్టంగా రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంట్లో అయితే రూ .15 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పెట్టుబడి అయిన రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే గరిష్టంగా ప్రతి నెలా రూ. 9,250 చొప్పున పెన్షన్ అందుకోవచ్చు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom