iDreamPost
android-app
ios-app

సూపర్‌ స్కీమ్‌: రోజుకు రూ. 14 చెల్లిస్తే.. భార్యాభర్తలిద్దరికి ప్రతి నెలా చేతికి రూ.10 వేలు

  • Published Mar 11, 2024 | 1:57 PM Updated Updated Mar 11, 2024 | 1:57 PM

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే అద్భుతమైన స్కీం అందుబాటులో ఉంది. రోజుకు రూ. 14 చెల్లిస్తే చాలు దంపతులిద్దరికీ ప్రతి నెల రూ. 10 వేలు అందుకోవచ్చు. ఎలా అంటే?

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే అద్భుతమైన స్కీం అందుబాటులో ఉంది. రోజుకు రూ. 14 చెల్లిస్తే చాలు దంపతులిద్దరికీ ప్రతి నెల రూ. 10 వేలు అందుకోవచ్చు. ఎలా అంటే?

  • Published Mar 11, 2024 | 1:57 PMUpdated Mar 11, 2024 | 1:57 PM
సూపర్‌ స్కీమ్‌: రోజుకు రూ. 14 చెల్లిస్తే.. భార్యాభర్తలిద్దరికి ప్రతి నెలా చేతికి రూ.10 వేలు

డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరమే. అవసరాలు తీర్చుకోవాలన్నా.. గౌవర మర్యాదలు దక్కాలన్నా డబ్బే కారణమవుతోంది. ప్రస్తుతం సమాజం అంతా డబ్బు వెనకాలే పరిగెడుతోంది. డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించడం, తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడులిచ్చే పథకాలు ఏమున్నాయబ్బా అంటూ ఆరా తీస్తున్నారు జనాలు. ఈ క్రమంలోనే కొందరు స్థిరాస్తిపై పెట్టుబడి పెడుతుంటే, మరికొందరు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్, ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారా? అయితే రోజుకు రూ. 14 చెల్లిస్తే చాలు భార్యాభర్తలిద్దరు నెలకు రూ. 10 వేలు అందుకోవచ్చు. అదెలా అంటే?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం అధిక రాబడులు ఇచ్చే పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. ముఖ్యంగా పోస్టాఫీస్ స్కీమ్స్ తో భారీగా ప్రయోజనాలు అందుతున్నాయి. తక్కువ పెట్టబడి, గ్యారంటీ రిటర్స్న్ వస్తుండడంతో ప్రభుత్వ పథకాలకు ఆదరణ పెరిగింది. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన మరో అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది. అదే అటల్ పెన్షన్ యోజన పథకం. అయితే ఇది అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పెన్షన్ అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది ప్రభుత్వం.

ప్రభుత్వ ఉద్యోగులకైతే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. మరి అసంఘటిత రంగ కార్మికులకు ఇలాంటి సౌకర్యం ఉండదు కదా. అందుకే వీరికి కూడా 60 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ అందాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరి పెట్టుబడి పెడితే.. 60ఏళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడిపై ఆదారపడి ప్రతి నెల పెన్షన్ రూపంలో ఆదాయం సమకూరుతుంది.

అయితే ఈ స్కీమ్ లో చేరే వ్యక్తుల వయసును బట్టి చెల్లించే మొత్తం మారుతుంటుంది. పెట్టిన పెట్టుబడిపై 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3 వేలు, 4 వేలు, గరిష్టంగా రూ. 5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ. 42 నుంచి గరిష్టంగా రూ. 210 వరకు చెల్లించాలి. ఒక వేళ నెలకు రూ. 210 చెల్లించాలనుకుంటే.. రోజుకు రూ. 7 ఆదా చేస్తే చాలు. 60ఏళ్లు నిండిన తర్వాత రూ. 5 వేల పెన్షన్ అందుకోవచ్చు. భార్యాభర్తలిద్దరు చేరితే అప్పుడు రోజుకు రూ. 14 ఆదా చేసి రూ. 420 చెల్లిస్తే చాలు. అప్పుడు దంపతులిద్దరికీ కలిపి రూ. 10 వేల వరకు వస్తుంది. ఇక ఈ అటల్ పెన్షన్ స్కీంలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఆన్ లైల్ లో చేసుకోవచ్చు. లేదా జాతీయ బ్యాంకుల్లో ఖాతా ఓపెన్ చేయొచ్చు.

అర్హులు వీరే:

18-40 సంవత్సరాల వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 40 ఏళ్లు దాటిన వారికి ఛాన్స్ లేదు. అటల్ పెన్షన్ యోజన స్కీంలో ఇన్వెస్ట్ చేయదలిచిన వారికి పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీం పరిధిలోకి వచ్చేవారు అనర్హులు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కూడా ఈ పథకానికి అర్హులు కారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişartemisbet girişgrandpashabet